కెసిఆర్‌తో మరోసారి హరీష్ రావు భేటీ

KCR-Harish Rao Meet Again Ahead of Kaleshwaram Panel Probe for English News Kindly Scroll Down

కలేశ్వరం విచారణ వేడెక్కుతుండగా… కెసిఆర్‌తో మరోసారి హరీష్ రావు భేటీ

గజ్వేల్, జూన్ 10
కలేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ వేడెక్కుతున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో కమిషన్ ముందు కెసిఆర్ చెప్పాల్సిన విషయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం.

ఇతీవల జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణలో హాజరైన హరీష్ రావు, విచారణ అనంతరం నేరుగా కెసిఆర్‌ను కలిసారు. ఇద్దరి మధ్య దాదాపు ఐదు గంటలపాటు సమావేశం సాగినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, జూన్ 6న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కూడా కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కెసిఆర్ హాజరుకానుండటంతో ఈ అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. విచారణల తర్వాత వచ్చే రాజకీయ పరిణామాలు కీలకంగా మారే అవకాశముంది.

Harish Rao Meets KCR Again Amid Kaleshwaram Commission Heat

Gajwel, June 10
Amid heightened political buzz surrounding the Kaleshwaram Lift Irrigation Project (KLIP) inquiry, senior BRS leader and former minister T. Harish Rao met with BRS chief and former CM K. Chandrashekar Rao (KCR) once again at the latter’s Erravalli farmhouse on Tuesday.

According to sources, the meeting focused on the details and strategy ahead of KCR’s scheduled appearance before the Kaleshwaram Commission on Wednesday. Harish Rao had himself appeared before the Justice Ghosh Commission just a day earlier. After his testimony, Rao directly visited KCR and held discussions for nearly five hours.

The political atmosphere in Telangana has heated up following a series of summons by the commission. On June 6, BJP MP Etela Rajender was also examined by the panel. With KCR set to appear next, political analysts believe these meetings could shape the future legal and political narrative of the state.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *