కరీంనగర్ జైలునుంచి విడుదల అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్టీ కార్యకర్తలు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. జై బీజేపీ…జైజై బండి సంజయ్ అంటూ నినదిస్తూ కదం తొక్కారు. పలు చోట్ల బాణా సంచా పేలుస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్దనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అయన పూల మాల వేసి నివాళులు అర్పించారు. బండి సంజయ్ ను భుజాల విూద ఎత్తుకుని బీజేపీ కార్యకర్తలు నడిచారు.