
హాలీవుడ్‌ను దాటి ‘టేక్ మీ హోమ్’ సత్తా!
ప్రపంచంలోనే అత్యధిక ప్రైజ్ మనీ (రూ. 8.5 కోట్లు) గెలుచుకున్న లఘు చిత్రం టేక్ మీ హోమ్ తో తెలుగు మహిళా ప్రొడ్యూసర్ అపూర్వ చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు.
హాలీవుడ్లో స్థిరపడిన అపూర్వ ఈ సినిమా ద్వారా దాదాపు 700 పైగా ఎంట్రీలను వెనక్కినెట్టారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కొరియన్ యువతి లిజ్, మహిళా సినిమాటిక్ టాలెంట్‌కు నిలువెత్తు నిదర్శనం.
తెలుగు నుంచి వచ్చిన అపూర్వ అంతర్జాతీయ వేదికపై తమ గొంతును వినిపిస్తున్న ప్రతిభావంతుల ప్రతినిధిగా నిలిచారు.