
తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి సింహవాహన సేవ భక్తులకు దీవెనలు!
తిరుపతి బ్రహ్మోత్సవాల్లో బుధవారం మూడవ రోజున శ్రీ గోవిందరాజస్వామి అనంతతేజోమూర్తిగా సింహవాహనంపై విహరించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు భక్తుల కోలాహల మధ్య వాహనసేవ వైభవంగా జరిగింది.

వాహనం ముందు గజరాజులు, కోలాటాలు, మంగళవాయిద్యాలు భక్తులకు ఆనందానందాలను పంచాయి. సింహం గాంభీర్యానికి, శక్తికి సంకేతం. భగవంతుని సింహబలాన్ని సూచించే ఈ సేవ భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది.
తర్వాత 10 నుంచి 11 వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి ముత్యపుపందిరి వాహన సేవ నిర్వహించనున్నారు. జీయర్ స్వాములు, టిటిడి అధికారులు, శ్రీవారి సేవకులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Simha Vahanam Seva: Divine Grace from Govindaraja Swamy in Tirupati
On the third day of the grand Brahmotsavam in Tirupati, Govindaraja Swamy appeared as Ananta Tejomurthi atop the majestic Simha Vahanam on Wednesday morning. The royal vahana seva, conducted from 7:00 AM to 9:00 AM, mesmerized devotees with its divine splendor.
The procession featured decorated elephants, vibrant kolatams, and soulful mangalavadyam. The lion, a symbol of majesty and spiritual power, signifies the Lord’s strength and grace. Devotees offered harathi and witnessed this spiritual spectacle with devotion.
Later, the Snapanatirumanjanam was held from 10:00 to 11:00 AM, followed by Muthyapu Pandiri Vahanam Seva scheduled for 7:00 to 9:00 PM. Thousands participated, led by Jeeyar Swamis and TTD officials.