ఈరోజు ఒక గొప్ప సుదినం ఈరోజుతో కోటి మందికి కంటి పరీక్షలు పూర్తి అయిన రోజని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సదాశివపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని అయన పరిశీలించారు. కోటి పరీక్షలు పూర్తయిన సందర్భంగా బెలూన్లను గాల్లో ఎగురవేసారు. జనవరి 18 2023న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అయింది. కంటి వెలుగు కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో కేక్ కటింగ్ చేసారు. మంత్రి మాట్లాడుతూ సదాశివపేట లో ఈ కార్యక్రమం జరపడం హర్షణీయం ముఖ్యమంత్రి ఏ ఒక్కరికీ కూడా కంటి బాధ వుండకూడదు అని కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు.
ప్రపంచంలోనే మొదటి స్థానంలో కంటి వెలుగు కార్యక్రమంలో తెలంగాణ వుంది. మన ఇంటికి వైద్యులు వచ్చి పరీక్ష చేసి కంటి వెలుగును ఇస్తున్నారు. ప్రతి పక్షాలు సైతం మెచ్చుకున్న పథకం కంటి వెలుగు పథకమని అన్నారు. ఢల్లీి, పంజాబ్ ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని తమ రాష్టాలలో అమలు చేసే యోచనలో వున్నారు. కంటి వెలుగు ప్రారంభించి నేటితో 50 వ రోజు 1500 బృందాలతో కోటి పరీక్షలు పుర్తినయ్యయి . ముఖ్యమంత్రి లక్ష్యం ఒక్కటే రాష్టం ఎవ్వరూ కంటి సమస్యతో బాధపడకుందా వుండాలి. కళ్యాణ లక్ష్మి, అసర పెన్షన్, కంటి వెలుగు పథకాలను కుటుంబంలో ఒక్కడిగా వుంటు పూర్తి చేశాడు ముఖ్యమంత్రి. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని పంపి నిటి కొరతను తీర్చాడు. సంక్షేమ పథకాలు అందని ఇల్లు రాష్టం లేదు అంటే విశేషం అని అన్నారు.