సంగారెడ్డి : నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో మైనర్ బాలిక ప్రసవం ఘటనలో ఉన్నతాధికారులు స్పందించారు. విధుల్లో అలసత్వానికి గాను ప్రిన్సిపల్ మంజుల, డిప్యూటీ వార్డెన్ నసీమ్ బేగం,స్టాఫ్ నర్స్ సంధ్యను సస్పెండ్ చేసారు. గత నెల చివరి వారంలో రెసిడెన్షియల్ స్కూల్ బాత్ రూమ్ లో బాలిక ప్రసవించిన విషయం తెలిసిందే. బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. విషయం తెలియగానే ప్రిన్సిపాల్ బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, బాలిక, శిశువుని తల్లిదండ్రులకు అప్పగించింది. బాలిక తల్లిదండ్రులు శిశువును ముళ్ళపొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో పోలీసులు శిశువును ఆసుపత్రికి తరలించారు. శిశువు దొరికిన కేసు దర్యాప్తులో భాగంగా బాలిక ప్రసవం ఉదంతం వెలుగులోకి వచ్చింది.