బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్ట్ ను నిరసిస్తూ బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్ వద్ద ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. భారీ ఎత్తున కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లను సైతం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ‘‘ఛలో బొమ్మల రామారం’’ మేడ్చల్ జిల్లా బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున తరలివస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు బొమ్మల రామారానికి తరలివచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు స్టేషన్ ఎదుట వున్న టీ స్టాల్, ఇతర షాపులను మూసివేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు…