పార్లమెంట్ లో బి.సి బిల్లు పెట్టి చట్టసభలలో బి.సిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలోఎస్సి,ఎస్టి,బిసి లకు రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్వర్యంలో డిల్లీలోని పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరిపారు. వందలాది మంది సర్పంచులు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్లమెంట్ కు రావడంతో జంతర్ మంతర్ దద్దరిల్లిపోయింది. పెద్ద ఎత్తున వచ్చిన వీరిని కంట్రోల్ చేయడానికి పోలీసులకు ఇబ్బంది కలిగింది. ‘‘ఓట్లు బి.సి లవి ? సీట్లు అగ్రకులాలకా ! ? రాజ్యాదికారంలో వాటా కావలి’’ అంటూ నినాదాలు చేశారు. ఈ మహా ప్రధర్శనకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ కన్వీనర్ లాల్ కృష్ణ జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం నాయకత్వం వహించారు. ఈ ప్రదర్శనుద్దేశించి గుజ్జ కృష్ణ, కర్రీ వేణుమాధవ్, నీల వెంకటేష్, జి. అంజి తదితరులు ప్రసంగించారు. ధర్నానుద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ
మేఘాల విూద 10 శాతం రిజర్వేషన్లు పెట్టారు. కాని బి.సి లకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలని 30 సం.రాలుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ దేశంలో బి.సి లను బిచ్చగాళ్ళను చేశారని విమర్శించారు. బి.సిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ గొర్రెలు ? బర్రెలు ?పందులు ? పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బి.సిలను శాశ్వత బిచ్చగాళ్ళను చేస్తున్నారని విమర్శించారు. బి.సి.ల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్‌ను తొలగించాలని, బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ఎస్సీ /ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి. యాక్ట్ను తీసుకురావాలని, ప్రపంచీకరణ సరళీకృత, ఆర్థిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ /బి.సి.లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీం కోర్టు` హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బి.సి.లకు రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బి.సి.లకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.కేంధ్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల లో బి.సి. కులాల వాది లెక్కలు సేకరించాలని కోరారు.ఈ మహాధర్నాలో భూపేసాగర్, ఈ మహా ధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం,డిల్లీ ఇంచార్జ్ కర్రి వేనుమాదవ్, తెలంగాణా రాష్ట్ర కన్వినర్ లాల్ కృష్ణ, తెలంగాణా బిసి
సంఘం అద్యక్షులు సి.రాజేందర్, బిసి ఇక్యవేదిక అద్యక్షులు అనంతయ్య,నిరుద్యోగ జేఏసి చర్మెన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణపు శ్రీనివాస్, నల్లగొంగ జిల్లా అద్యక్షులు దుడుక లక్ష్మి నారాయణ, బిసి విద్యార్ధి సంఘం తెలంగాణా అద్యక్షులు అంజి, బిసి విద్యార్ధి సంఘం తెలంగాణా వర్కింగ్ ప్రిసిడెంట్ బోల్కం వెంకట్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వేముల రామ కృష్ణ, బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు కే.రామరాజు వర్మ,సందీప్ గౌడ్, హరీష్ యాదవ్, తిరుపతి, సైదులు, సతీష్, నాగరాజు, రామస్వామి, బోయిన్ పృద్వి, రామరాజు, రాజేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు