ఎమ్మెల్యే సంజయ్‌ ది రెండునాల్కల ధోరణి అబద్ధాలు అడుతూనే నిజాయితి పరుడంటూ బుకాయింపు యాక్షన్‌ డైరెక్షన్లు నీకే తెలుసు… బీజేపీ నాయకురాలు, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి


జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ది రెండునాల్కల ధోరణి అని వెనకోకటి మాట్లాడి ముందొకటి ప్రదశిస్తారని ఇది ఆయన కుటిల రాజకీయ చతురతకు, నియంతృత్వ పాలనకు నిదర్శనమని బిజెపి నాయకురాలు, తాజా మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌ అన్నారు. మంగళవారం జగిత్యాల ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రావణి మాట్లాడారు ఎమ్మెల్యే సంజయ్‌ వేధింపుల అంశం వాస్తవమని తాను నిమిత్తమాత్రుడనంటూ మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని ప్రకటించుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఇది ప్రజలు అంటే బాగుంటుందని శ్రావణి అన్నారు. జగిత్యాలకు వచ్చిన ఎంపీ అర్వింద్‌ మాట్లాడిన మాటలు బాధించాయని సంజయ్‌ మాట్లాడడం విడ్డురంగా ఉందని విూ వేధింపులతో నేను ఏడ్చుకుంటు పార్టీని విడితే ఎందుకు అపలేదని ప్రశ్నించారు. తండ్రి బిడ్డల సంబంధం మా ఇద్దరిదంటూ సంజయ్‌ కల్లబొల్లి మాటలు మాట్లాడారని బిడ్డ ఏడ్చుకుంటుపోతే తండ్రిగా పిలిచి మాట్లాడే బాధ్యత విూపై లేదా అని ప్రశ్నించారు. వాస్తవానికి నేను సంజయ్‌ స్వంత కూతురైతే వేరుగా ఉండదేమో అని శ్రావణి ఎద్దేవా చేశారు.జనకిపురం మహిళా సర్పంచ్‌ నవ్య తనకు జరుగుతున్న ఆన్యాయంపై విూడియా సాక్షిగా ప్రశ్నిస్తే వెంటనే అక్కడి ఎమ్మెల్యే రాజయ్య వాలింటికి వెళ్లి మాట్లాడిరది నిజం కాదా అని ప్రశ్నించారు.మరి విూరు తప్పు చేయలేదు అని అనుకుంటే విూరు ఈ బిడ్డ దగ్గరకు అప్పుడే వచ్చే వారు కదా ,నిన్న జరిగిన ప్రెస్‌ విూట్‌ లో ఎమ్మెల్యే సంజయ్‌ కు ఇరువైపులా కూర్చునేవారిలో ఇసుక దందా చేసే వారు వున్నారు కాదా అందులో ఎవరి వాటా ఎంతనో అందులో ఎమ్మెల్యే వాటా ఎంతనో చెప్పమంటారా అని శ్రావణి ప్రశ్నించారు. ప్రజలకు అన్ని తెలుసని రాత్రి పూట ఎన్ని ట్రక్కుల ఇసుక రవాణా వస్తుందో అవసరమైతే తహసిల్‌ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.. ఇసుక దందాలు, భూ కబ్జాలు, కాంట్రాక్టులు విూరే చేసుకుంటూ బిజెపి నాయకులను నిందించడం విడ్ఫురమన్నారు. అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడే ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అమరవీరుల స్తూపం నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్నా ఎందుకు ప్రారంభినచలేదని శ్రావణి ప్రశ్నించారు. మునిసిపల్‌ పార్క్‌ అభివృద్ధి కోసం కేటాయించిన 50 లక్షల పనులను ఎందుకు చేపట్టడం లేదని ఇవన్నీ ఎమ్మెల్యే స్వార్థం కోసం చేస్తున్న పనులేనని శ్రావణి అన్నారు. అబద్ధాలు ఆడడం సంజయ్‌ కు అలవాటేనని ఇటీవలే కాలేజ్‌ మైదానంలో ఓట్ల బిచ్చ గాండ్ల మంటూ మాట్లాడి తిరిగి మాట మార్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. యాక్షన్‌ డైరెక్షన్‌ లు చేయించడంలో సంజయ్‌ కుమార్‌ దిట్ట అని ప్రజలందరి ముందు, హైకమాండ్‌ ముందు కౌన్సిలర్లను బద్నాం చేసింది సంజయ్‌ కాదా ఆని శ్రావణి అన్నారు. ఎంపీ అర్వింద్‌ అతని కుటుంబం గురించి మాట్లాడిన సంజయ్‌ కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వారేనని వారిలాగా విూరెందుకు ఉండడం లేదని శ్రావణి అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ వేధింపులు వాస్తవమేనని అందుకే త్వరలో ఎమ్మెల్యే బాధితుల సంఘం ఏర్పాటు కానున్నదని దీనికి అధ్యక్షత నేను వహిస్తానని కార్యదర్శిగా తిరుపతి ఉంటారని ఇంకా చాలామంది చేరేవారున్నారని ఇంకా చాలా మాట్లాడేది ఉంటుందని శ్రావణి విూడియా కు చెప్పారు. ఈ సమావేశంలో జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్‌ మదన్‌ మోహన్‌ , పన్నాల తిరుపతి, జగిత్యాల పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్‌ కుమార్‌, సారంగాపూర్‌ మండల అధ్యక్షులు ఎండబెట్ట వరుణ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, జున్ను రాజేందర్‌, బొద్దుల గజేందర్‌, శ్రీనివాస్‌, నక్క జీవన్‌ తోపాటు పలువురు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *