అసంతృప్తి కప్పి పుచ్చుకునేందుకే బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు కేసిఆర్‌ 9 ఏళ్లలో పాలనలో దగాపడ్డ రైతులు, దళిత, గిరిజన, బిసి ,మైనారిటీ వర్గాల ప్రజలు… ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి



రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను చర్చకు రానీయకుండా, కప్పిపుచ్చుకునేందుకుబిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలను తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి ద్వజమేత్తారు.ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ కార్యకర్తలు, నాయకుల అసంతృప్తి తొలగించుతారెమోగాని ప్రజల్లోని అసంతృప్తిని తొలగించలేరని ఎమ్మెల్సీ మండిపడ్డారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తామని హావిూ ఇచ్చి తిరిగి 2018 లో రెండో పర్యాయం కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం కనుమరుగయిందని ఆరోపించారు.8 ఏళ్లలో ఇళ్ల నిర్మాణ వ్యయం రెట్టింపు కాగా, స్వంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయం రు.5 లక్షల నుండి మూడు లక్షలకు కుదించడం సరికాదన్నారు.202223 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున 3.60 లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు సీఎం విచక్షణ మేరకు మరో 40 వేల మంజూరుకు బడ్జెట్లో రు.12 వేల కోట్లు నిధులు కేటాయించినా ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేదని జీవన్‌ రెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.202324 ఆర్థిక సంవత్సరంలో సైతం మళ్లీ నాలుగు లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మిస్తామని నిధులు కేటాయించారని గుర్తుచేస్తూ గతంలో నాలుగు లక్షల డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ సంగతేమిటని జీవన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను నిలదీశారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు అమలు చేస్తున్నామని చెబుతూ తెలంగాణ రోల్‌ మోడల్‌ అంటూ ప్రచారం చేసుకుంటు దళితులను మోసం చేస్తున్నారనీ విమర్శించారు.కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు యూపీఎ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ ఆధ్వర్యంలో జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయించాలని ఎస్సీ సబ్‌ ప్లాన్‌ చట్టం చేశామని ఆయన గుర్తు చేశారు.ఎస్సీల అభివృద్ధి కోసం కేటాయించిన రు.30 వేల కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయని,బహుజన మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే 10 లక్షలతో దళిత బంధు స్కీం తెరపైకి తీసుకువచ్చారని వివరించారు.202223 లో ప్రతి నియోజకవర్గానికి 1500 మందికి 10 లక్షల చొప్పున దళిత బంధు కేటాయించేందుకు బడ్జెట్లో రూ .17, 700 కోట్లు కేటాయించినా ఒక్కరికీ కూడా దళిత బందు ఇవ్వలేదని మండిపడ్డారు.మరోమారు 202324 ఆర్థిక సంవత్సరంలో సైతం అవే నిధులను దళిత బందుకు కేటాయించారని గతంలో కేటాయించిన నిధులు ఎటుపోయాయని చెప్పాలని డిమాండ్‌ చేశారు.దళిత బిడ్డగా దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఖర్చు చేయకపొవడంలో విూ వైఫల్యం లేదాని…ఖర్చు చేయడంలో విూకు బాధ్యత లేదా అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ను ప్రశ్నించారు.మునుగోడు ఉప ఎన్నికల్లో గిరిజనులకు గిరిజన బందు ఇస్తామని చెప్పి మరిచారని ఇదే అంశాన్ని శాసనమండలి సమావేశాల్లో లేవనేత్తితే సమాధానం లేదన్నారు.గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి నాలుగేళ్లు గడిచిపోయాయని,గిరిజనులకు రిజర్వేషన్‌ పెంచడంలో కేంద్రంపై నెపం నెట్టుతూ ఆరేళ్లు గిరిజన హక్కులను కాలరాశారని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు.శాసనమండలి వేదికగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదని విమర్శించారు.80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికీ కేవలం 17వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారని ఎద్దేవా చేశారు.తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్లు అంగట్లో అమ్మకానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.జనాభాలో 50శాతం ఉన్న బలహీన వర్గాలకోసం స్వయ ఉపాధి పథకాలు కూడా అమలు చేయడం లేదని జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధిలో ఉందంటూ చెబుతున్న సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ కేటాయింపు మాత్రం విూ చేతిలో ఉంటే ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. మహిళలను సైతం సీఎం కేసీఆర్‌ మోసానికి గురి చేస్తున్నారని, మహిళలకు ఇవ్వాల్సిన ఉచిత వడ్డీ నాలుగేళ్లుగా బకాయి చెల్లించడం లేదని ఆరోపించారు.రైతులకు రైతుబంధు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటూ నాలుగు ఏళ్లు గడుస్తున్నా కేవలం 37 వేల రుణం మాత్రమే రుణమాఫీ అమలు చేశారని ఆయన మండిపడ్డారు.కేంద్ర వివక్ష చూపుతున్నది కేంద్రం సహకరించడం లేదు అంటూ సీఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించానని చెప్పుకుంటున్న కేసీఆర్‌ కు సీఎంగా కొనసాగే నైతిక హక్కులేదని తెల్చిచెప్పారు.కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారమైందని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజల హక్కుల సాధించడంలో సీఎం కేసీఆర్‌ వైఫల్యం చెందారని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు.రాష్ట్ర ప్రజల హక్కులు సాధించడం కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు.పార్లమెంటులో తలుపులు బిగించి రాష్ట్రం ఇచ్చారంటూ తెలంగాణ ప్రజలను కించపరిచిన ప్రధాన మంత్రి మోడీకి తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు.రాష్ట్రంలోని బలహీనవర్గాలు గిరిజనులు, రైతులు, దళితులు మైనార్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్‌ దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు.సీఎం కేసీఆర్‌ కు ఇకనైనా జ్ఞానోదయం కలగాలని దేవుని ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు.వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ తెలుగు వారి ఆత్మగౌరవం అంటున్న మంత్రి కేటీఆర్‌..వ్యవసాయ అనుబంధ చక్కర ఫ్యాక్టరీలు ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కాదా అని నిలదీశారు.ఇకనైనా వాస్తవాలను గ్రహించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు.ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, టిపీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్‌,జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కల్లేపల్లి దుర్గయ్య, చాంద్‌ పాషా,బీరం రాజేష్‌, లైసెట్టి విజయ్‌,చిలుముల లక్ష్మణ్‌, అభిలాష్‌,నేహాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *