98% హావిూలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిదే
ఎమ్మెల్సీ గోవింద్‌ రెడ్డి ,బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా


బద్వేలు
బద్వేల్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఉదయం నిర్వహించిన వైయస్సార్‌ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవింద్‌ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనిఫెస్టోను 98% పూర్తి చేసిన ఘనత కేవలం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే ఉందని తెలిపారు మా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమము మరియు అభివృద్ధి రెండిరటిని సమతూకంలో సమన్యాయం చేస్తూ ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బద్వేల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాల్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఆయన మాట్లాడుతూ బద్వేల్‌ సమగ్ర అభివృద్ధికి 130 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రణాళికలు రచించి సుమారు 50 కోట్ల పనులను పూర్తి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమాని కి ఆడ చైర్మన్‌ గురు మోహన్‌సగర కార్పొరేషన్‌ చైర్మన్‌ రమణమ్మమార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ లక్ష్మీదేవిస్టేట్‌ సివిల్‌ సప్లయిర్స్‌ డైరెక్టర్‌ సుందర్‌ రామిరెడ్డి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సాయి కృష్ణ బద్వేల్‌ మున్సిపాలిటీ కన్వీనర్‌ యద్ద రెడ్డి అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు మున్సిపల్‌ కమిషనర్‌ కెవి కృష్ణారెడ్డి మెప్మా అధికారి అయ్యవారయ్య డ్వాక్రా సంఘాల మహిళలు నాయకులు వైఎస్‌ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు మున్సిపల్‌ అధికారులు సిబ్బంది మున్సిపాలిటీల వార్డ్‌ కౌన్సిలర్లు కోఆప్షన్‌ సభ్యులు ఇన్చార్జులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *