మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలుర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చితకబాదాడు. పదవ తరగతి పరీక్ష కోసం సెంటర్ కు వెళ్ళే సమయంలో పాటశాలలో జరిగే ప్రార్థన కు ప్రేయర్ కు ఆలస్యంగా హాజరు కావడంతో ప్రిన్సిపాల్ ఆగ్రహించాడు.
ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తాళం గుత్తితో కొట్టడంతో సాత్విక్ కు గాయాలు అయ్యాయి. గాయాలు అయిన విద్యార్థికి ఎలాంటి వైద్యం అందించకుండానే పరీక్షకు పంపించారు. సాత్విక్ పై దాడి చేసిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని సాత్విక్ తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.