రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఒ కుటుంబంలో దంపతులు వారి చిన్నారి పసికందును చంపి, వారు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసునమోదు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం ఉమ్మేతల అశోక్(25), తన భార్య అంకిత(22),మూడు నెలల కూతురు అందరు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి క్యారెట్ తీసుకొని నగరంలోని మార్కెట్ కి వెళ్లి మంగళవారం ఉదయం 4 గంటలకు వచ్చి ఇంటిలోనే ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.