రాష్ట్రంలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా పరీక్షలకు సంబంధిత ప్రశ్నపత్రాలు స్థానిక పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచుతారు. పరీక్షకు 30నిమిషాల ముందు సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ ప్రొటెక్షన్ తో ఆ ప్రశ్న పత్రాలను జాగ్రత్త గా సెంటర్ లోకి తీసుకువస్తారు. కానీ హైద్రాబాద్ లోని ఓ స్కూల్ పరీక్ష సెంటర్ లో నిర్లక్షంగా కనీస పోలీసు భద్రత లేకుండా ఒక అటెండర్ తో పోలీస్ స్టేషన్ నుండి కాలి నడక తో పరీక్ష ప్రశ్నపత్రాలు తెప్పించారని తెలుస్తోంది.
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం చల్లారాక ముందే మరో ప్రశ్న పత్రాల నిర్లక్ష్యం బయటపడిరది.