గోవులు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని పూజ్య సద్గురు శ్రీ సాయిరాజ్ బాబా అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలోని శక్తి సాయి సదనాలై షిరిడి సాయి ద్వారకామయి మందిరంలో యాగశాల నిర్మాణానికి పూజ్య సద్గురు శ్రీ సాయిరాజ్ బాబా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తి సాయి సదనాలై షిరిడి సాయి భక్తులు దాతల సహకారంతో యాగశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆలయ వ్యవస్థాపకులు పూజ్య సద్గురు శ్రీ సాయిరాజ్ బాబా వివరించారు. శక్తి సాయి సదనాలై ద్వారకమై మందిరంలో సాయిబాబా, శివాలయం, దత్తాత్రేయ స్వామి, విగ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సరస్వతి దేవి దుర్గామాత, శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు, శ్రీ ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, దేవదామూర్తులున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థమై యాగశాల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. గోవులతో వచ్చు ప్రతి పదార్థం సమజానికి మేలు చేసేదేనని తెలిపారు. అనంతరం శ్రీ సాయిరాజ్ బాబా ప్రత్యేక హారతులు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.