ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ద్వారా గరుడ వార్త ఎప్పుడైన, ఎక్కడైన… ప్రజల సమస్యలను ప్రపంచానికి ప్రతిబింబించేలా ఉండాలి… ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది రాపోలు భాస్కర్
గరుడ వార్త తెలుగు దినపత్రిక ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గరుడ వార్త ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ను హైకోర్టు ప్రముఖ న్యాయవాది సామాజికవేత్త రాపోలు భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వార్తాపత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయస్సుకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను ప్రపంచానికి ప్రతిబింబించేలా ఉండాలన్నారు. తన 25 సంవత్సరాల సుదీర్ఘ న్యాయవాద సేవలో వార్త పత్రికలు, టీవీ ఛానళ్లు వాస్తవాలను వెలుగులోకి తెస్తూ, ఎందరినో ఆదుకున్నాయని గుర్తు చేశారు. దేశంలోనే యువ ఎంపీపీగా ఎన్నికైన వారిలో ముందుండే తాను, యువ ఎంపీపీగా ఎన్నికవ్వడానికి, అదేవిదంగా రెండు సార్లు ఎంపీపీగా ఎన్నికవడానికి వార్తాపత్రికలు పాత్ర కూడా కీలకమని, అందుకు ముఖ్య కారణం తాను యువకుడిగా ఉన్నప్పటి నుండి ప్రజలకు చేస్తున్న సేవలను ప్రతిరోజు గుర్తించి వార్తలు రాయడం ద్వారా తాను మరింత ప్రజలకు చేరువై మరెన్నో సేవలు చేయగలిగానని హైకోర్టు ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు. గరుడ వార్త ప్రజల ఇబ్బందులు, అవసరాలను ప్రపంచానికి వార్తల ద్వారా ప్రతిబింబిస్తూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. garudavarthanews.in తోపాటుగా garudavarthanews.com ఆన్లైన్ ద్వారా ఎప్పుడైన, ఎక్కడైన గరుడవార్త పొందవొచ్చు.