హైదరాబాద్ (గరుడ వార్త) : తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల సమిష్టిగా
19వ జనరల్ బాడీ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ అరణ్య భవన్ లో ఎన్నికల అధికారి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక ఎన్నికల్లో అధ్యక్షుడిగా డిప్యూటీ రేంజ్ అధికారి బిల్వత్ కస్న, ఉపాధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సెక్షన్ ఆఫీసర్ నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగేంద్రబాబు, జాయింట్ సెక్రటరీగా సునీత ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం తమను ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల సమస్యల పరిష్కారానికి తాము ఎంతగానో కృషి చేస్తామని అంతేకాకుండా వారి అభ్యున్నతికి కూడా కట్టుబడి ఉన్నామని నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రకటించింది.