క్యూట్‌ పప్పీస్‌ తో ప్రభాస్‌ క్యూటీ


మహేష్‌ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమా తో హీరోయన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ క్రితి సనన్‌. తెలుగు లో ఈ అమ్మడు మొదటి సినిమా తో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో కృతి సనన్‌ బాలీవుడ్‌ లో సినిమాల వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌.. క్రేజీ హీరోయిన్‌ గా కృతి సనన్‌ దూసుకు పోతుంది. హీరోయిన్‌ గా ఈ అమ్మడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఈమె నటించిన నాలుగు అయిదు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్‌ గా ఇంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా హాట్‌ పొటోలు షేర్‌ చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. ఇన్‌ స్టా లో ఈ అమ్మడి యొక్క ఫాలోవర్స్‌ సంఖ్య 52 మిలియన్స్‌ పైనే. రెగ్యులర్‌ గా తన ఫాలోవర్స్‌ కోసం ఈ అమ్మడు హాట్‌ అందాల ఆరబోతతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి క్యూట్‌ ఫొటోలు షేర్‌ చేస్తోంది. త్వరలో ఈ అమ్మడు ప్రభాస్‌ తో కలిసి ఆదిపురుష్‌ సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ అమ్మడు క్యూట్‌ పప్పీస్‌ తో ఉన్న తన క్యూట్‌ ఫొటోను షేర్‌ చేసింది. పెద్దగా మేకప్‌ లేకుండా నాచురల్‌ స్మైల్‌ తో చాలా క్యూట్‌ గా కృతి సనన్‌ ఉందంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ మధ్య ఈ అమ్మడు ప్రభాస్‌ తో ప్రేమలో ఉందనే వార్తలు జోరుగా వచ్చాయి. ఇద్దరి మధ్య వ్యవహారం కాస్త ఎక్కువ దూరం వెళ్లిందని.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలను కృతి సనన్‌ కొట్టి పారేసింది. అన్‌ స్టాపబుల్‌ షో లో బాలకృష్ణ సాక్షిగా ప్రభాస్‌ కూడా ఆ పుకార్లను కొట్టి పారేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *