కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారం దేశవ్యాప్తంగానే గాక.. అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారింది. రాహుల్ కేసును తాము గమనిస్తున్నామని ఇప్పటికే అగ్రరా జ్యం అమెరికా వెల్లడిరచగా.. తాజాగా జర్మనీ కూడా స్పందించింది. రాహుల్ కేసులోనూ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని, తీర్పుపై ఆయన అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది. ‘‘భారత్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఆ తీర్పు కారణంగా ఆయన లోక్సభ సభ్యత్వం రద్దవ్వడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం. అయితే ఈ తీర్పుపై ఆయన అప్పీల్ చేసుకునే స్థితిలోనే ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా.. ఏ ప్రాతిపదికన ఆయనపై అనర్హత పడిరది అనేది స్పష్టమవుతుంది. ఈ కేసుకు న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ భావిస్తోంది’’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఓ మీడియా సమావేశంలో వెల్లడిరచారు. ఇటీవల, అమెరికా కూడా రాహుల్ ‘అనర్హత’ వ్యవహారంపై స్పందించిన విషయం తెలిసిందే. ఏ ప్రజాస్వామ్యానికైనా.. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాల్లాంటివని అగ్రరాజ్యం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడిరచింది.
ప్రధాని మోదీ ఇంటి పేరును కించపర్చారన్న కేసులో ఇటీవల రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రాహుల్పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై ఎగువ కోర్టులో సవాల్ చేసేందుకు ఆ పార్టీ న్యాయ నిపుణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పిటిషన్ను వారు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో సూరత్ సెషన్స్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలయ్యే అవకాశముందని తెలుస్తోంది.