యువ కార్యకర్తల పాత్ర కీలకం ….
మేడ్చల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సుశాంత్ గౌడ్
6 గ్యారంటీ పథకాలను గడపగడపకు చేర్చడమే లక్ష్యం…
మండల అధ్యక్షులు బొమ్మల్పల్లి నరసింహులు యాదవ్
కార్యకర్తల సమిష్టి కృషితోనే విజయం సాదించగలం…
మండల వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి
గరుడ వార్త శామీర్పేట్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను కడప గడపకు చేర్చే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు అంతా సమిష్టిగా కలిసి ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సుశాంత్ గౌడ్ తెలిపారు. ఆదివారం మూడు చింతలపల్లి మండలోనున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు వైద్యనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ యువనాయకులు అంతా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు మూడుచింతలపల్లి మండల అధ్యక్షులు బొమ్మల్పల్లి నరసింహులు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై మరింత నమ్మకం పెరిగిందని ఈసారి మేడ్చల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు మండల వైస్ ఎంపీపీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంద శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో యువ కార్యకర్తల పాత్ర కీలకమని అందుకు ప్రతి కార్యకర్తలు కూడా యువ కార్యకర్తలకు దన్నుగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బండి జగన్నాథం ఎంపీటీసీ అఖిలేష్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ రామిడి శశిదర్ రెడ్డి, మదన్ మెహన్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ బాలనర్సిహ్మ, కిసరి నర్సింహులు, మండల కిసాన్ సెల్ అధ్యక్షు గుర్రం బస్వా రెడ్డి, కోశాధికారి వీరేషం సేటు, ఎస్సి సెల్ అధ్యక్షుడు లక్షణ్, సీనియర్ నాయకులు దోసకాయల వెంకటష్, వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శీకాంత్ గౌడ్, కటికెల గోపి, విరాలాల్, మల్లరెడ్డి, కావాలి సందిప్, కటికల జనార్దన్, నర్సింహ, కిసరి భానుచందర్ తదితర కాంగ్రెస్ పార్టి యువజన నాయకులు కార్యకర్తలు పాల్గోనారు.