మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో హెచ్‌ఐవీ చాపకింద నీరులా వ్యాపి స్తోంది. ఆ వ్యాధిని తరిమికొట్టేందుకు, బాధితు లకు మందులు ఇచ్చి పరీక్షలు చేసేందుకు ఉమ్మడి జిల్లాకు కలిపి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఒక్కటే ఏఆర్‌టీ(యాంటీ రిట్రోవైరల్ థెరపీ) సెంటర్ ఉండడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. దూర ప్రాం తాల నుంచి వ్యయప్రాయాసలకోర్చి రోజుకు 300 నుంచి 350 మంది రోగులు ఓపీ కోసం వస్తున్నారు. నెలకు ఎనిమిది వేల మందికిపైగా మందుల కోసం వస్తున్నారు. అయితే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు నెల నెలా పరీక్షలు చేయాల్సి ఉండగా, ఒక్కరే ల్యాబ్ టెక్నీషియన్ ఉండడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది.18,960 మందికి..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18,960 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో 5,879 మంది, నాగర్‌కర్నూల్‌లో 4,354, నారాయణపేటలో 3,589, గద్వాల్‌లో 2,193, వనపర్తిలో 2,945 మంది ఉన్నారు. ఇంత మందికి కలిపి జిల్లా కేంద్రంలో ఒక్కటే ఏఆర్‌టీ సెంటర్ ఉంది. వాస్తవానికి ప్రతీ జిల్లాకు ఒక ఏఆర్‌టీ సెంటర్ ఉండాలి. కానీ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏఆర్‌టీ సెంటర్లు మంజూరు చేయలేదు. తాజాగా ప్రభుత్వం వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్ జిల్లాల్లో ఏఆర్‌టీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో రెండు సెంటర్లకు మాత్రమే అవకాశం ఇచ్చేలా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో లింక్ ఏఆర్‌టీ సెంటర్లు 10 ఉన్నాయి. అవి గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, షాద్‌నగర్, అలంపూర్, కొల్లాపూర్, కోడంగల్‌లలో ఉన్నాయి. కానీ అక్కడికి చాలా మంది రోగులు వెళ్లడం లేదు. అక్కడ మందులు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంది.ఒక్కరే ల్యాబ్ టెక్నీషియన్..ఏఆర్‌టీ సెంటర్‌లో ముగ్గురు వైద్యాధి కారులు, కౌన్సిలర్లు, డాటా మేనేజర్లు, నర్సింగ్ స్టాఫు, ఫార్మసిస్టులు ఉన్నారు. ల్యాబ్ టెక్నీషి యన్లు ముగ్గురు ఉండాల్సి ఉండగా, ఒక్కరే ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 వేల మంది హెచ్‌ఐవీ బాధితులకు ఒక్కరే ల్యాబ్ టెక్నీషియన్ అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. రోజూ సీడీ-4 కౌంటు టెస్టు, ప్రతీ నెల హెచ్‌ఐవీ వైరల్ లోడిరగ్ టెస్టులు ఒక్కడే చేయాల్సి ఉండడంతో పనిభారం పెరిగి, మానసిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఒకవేళ ఆ ల్యాబ్ టెక్నీషియన్ సెలవు పెడితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వెనుదిరిగి పోవాల్సిందే.
వివాదాలకు అడ్డా…ఏఆర్‌టీ సెంటర్ వివా దాలకు అడ్డాగా మారింది. కొంత కాలంగా సిబ్బంది ఒకరు తోటి సిబ్బంది విధులకు రాకపో యినా, ఆలస్యంగా వచ్చినా వారందరి సంతకాలు ఫోర్జరీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల అందులో పనిచేసే సిబ్బంది ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నంత వరకు వెళ్లినట్లు తెలిసింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది ఒక వర్గానికి చెందిన వారు ఉండ డంతో వారిదే పైచేయి కొనసాగుతోందని, వారు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారని అధికారుల విచారణలో తేలినట్లు తెలిసింది. అదే వర్గానికి చెందిన కొందరు కౌన్సిలరు కౌన్సెలింగ్ పేరుతో మత మార్పిడిలపై కౌన్సెలింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
పరిశీలించి చర్యలు తీసుకుంటాంఏఆర్‌టీ సెంటర్‌లో కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. వాటిపై విచారణ జరుగుతోంది. పరిశీలించి, బాధ్యులపై చర్య లు తీసుకుంటాం. ఒక్కరే ల్యాబ్ టెక్నీషియన్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై టీఎస్ సాక్స్‌కు లేఖ రాస్తాం.- డా. రమేష్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్