టిక్కెట్ల కోసం బిఆర్‌ఎస్‌ నేతల పడరాని పాట్లు మనపరిస్థితేంటి…? కసీఆర్‌ సర్వేతో వణుకు

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలని నిర్ణయించుకున్నారు. ము చ్చటగా మూడోసారి కూడా పార్టీని అదికారంలోకి తీసుకువచ్చి.. రికార్డు సృష్టించాలని.. కేసీఆర్‌ నిర్ణయిం చుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికలు అంత ఈజీగా కనిపించడం లేదు. గతానికి భిన్నంగా బీజేపీ పుం జుకోవడం.. అదేసమయంలో కాంగ్రెస్‌ కూడా పరుగులు పెడుతుండడం సహజంగానే అధికారపార్టీని ఇర కాటంలోకి నెట్టింది. మరోవైపు.. సిట్టింగు ఎమ్మెల్యేలపై సర్వే చేయిస్తున్నారు. సిట్టింగ్‌ నేతల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు?  సిట్టింగులకు మళ్లీ టికెట్లు ఇస్తే నెగ్గుతారా?  లేదా..? అనే విషయంపై ప్రశాంత్‌ కిశోర్‌ సహా.. ఇతర వర్గాలతోనూ కేసీఆర్‌ సర్వే చేయిస్తున్నారు. అయితే.. ఈ సర్వేల ఆధారంగానే నేతలను మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సర్వేలో 90 మార్కులకు పైగా వస్తేనే.. టికెట్‌ మళ్లీ దక్కుతుందనే ప్రచారం ఉంది. అయితే.. ఇక్కడే సిట్టింగులు.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో ఎంత నిజం ఉంది?  అంతా సర్వేనే నమ్ముకుని.. ముందుకు సాగితే.. ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్‌ కిశోర్‌ సర్వేలకు.. ప్రాధాన్యం తగ్గిపోతోందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన గోవా ఎన్నికల్లో సర్వేలు చేసిన ఆయన బీజేపీ పని అయిపోయిందని.. పశ్చిమ బెంగాల్‌ సీఎం.. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని తేల్చిచ్ప్ప్షెరు. దీంతో అక్కడ మమత పార్టీ నేతలు.. కోట్ల రూపాయలు వెదజల్లి మరీ.. ప్రచారం చేశారు. కానీ తీరా చూస్తే.. ఒక్కరంటే ఒక్కరు కూడా నెగ్గలేదు. ఇక యూపీలోనూ కాంగ్రెస్‌ పుంజుకుంటుందని.. 50 స్థానాలుదక్కించుకుంటుందని చెప్పిన పీకే.. సర్వే ఫెయిల్‌ అయింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటున్న టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు.. మధన పడుతున్నారు. ఆయన(పీకే) బృందం ఎవరిని కలుస్తోందో.. ఎవరితో మాట్లాడుతోందో.. తెలియదు. మా వరకు మేం బాగానే ప్రజల మధ్య ఉంటున్నాం. అయినప్పటికీ.. సీఎం కేసీఆర్‌ కూడా.. కేవలం సర్వేలపైనే ఆధారపడడం కాకుండా.. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రతి ననియోజకవర్గంలోనూ.. అధికారులు మేము కలిసి చేస్తున్న పనులపై నివేదికలు తెప్పించుకుని పరిశీలించాలి. కేవలం పీకే సర్వేతోనే ఆధారపడితే.. మా లాంటి నిజాయితీగా పనిచేసే నాయకులకు అన్యాయం జరిగినట్టే! అని కరీం నగర్‌ కు చెందిన ఒక ఎమ్మెల్యే మీడియా ముందు ఆఫ్‌ ది రికార్డుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంటే.. దాదాపు సగం మంది ఎమ్మెల్యేల్లో ఇదే వాదన వినిపిస్తోంది. కేసీఆర్‌ స్వయంగా వచ్చి..చూడాలని.. అప్పుడు ఎమ్మెల్యేల పనితీరును నిర్ణయించాలని. కోరుతున్నారు. మరి కేసీఆర్‌ సార్కు అంత సమయం ఉంటుందా?  ఉండదా? అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *