జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విడుదల చేసే జాయింట్ డిక్లరేషన్ కు సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ న్యూఢల్లీి డిక్లరేషన్ లోని మొత్తం 83 పేరాలను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదించాయి. జీ 20 సదస్సు సందర్భంగా భారత్ రూపొందించిన న్యూఢల్లీి డిక్లరేషన్ కు సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. జీ 20 అధ్యక్ష దేశంగా భారత్ కు ఇది గొప్ప విజయంగా భావించవచ్చు. అంతకుముందు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పేరాపై కొన్ని అభ్యంతరాలు రాగా, ఆ పేరాలో భారత్ పలు మార్పులు చేసింది.జీ 20 సదస్సు జరుగుతున్న భారత్ మండపం లో సభ్య దేశాల ప్రతినిధుల మధ్య రెండో సెషన్ చర్చ జరుగుతున్న సమయంలో న్యూఢల్లీి డిక్లరేషన్ కు సభ్య దేశాల ఏకగ్రీవ ఆమోదం లభించిన విషయాన్ని భారత ప్రధాని మోదీ వెల్లడిరచారు. అందరి సహకారం, కృషితో ఇది సాధ్యమైందన్నారు. ‘‘ఇప్పుడే శుభవార్త తెలిసింది. మా టీమ్స్ కృషి, విూ సహకారంతో న్యూ ఢల్లీి డిక్లరేషన్ కు ఏకగ్రీవ ఆమోదం లభించింది’’ అని మోదీ ప్రకటించారు. ‘‘ఇందుకు సహకరించిన, కృషి చేసిన భారత మంత్రులు, అధికారుల బృందానికి, షేర్పాలకు, ఇతర అధికారులకు ధన్యవాదాలు’’ అన్నారు.జీ 20 సదస్సులో సభ్య దేశాల అధినేతలు సంయుక్తంగా ప్రకటించాల్సిన న్యూఢల్లీి డిక్లరేషన్ కు ఏకగ్రీవ ఆమోదం లభించడం కొంత సమస్యగా మారింది. రష్యా ` ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై డిక్లరేషన్ లో పేర్కొన్న లైన్స్ ను కొన్ని సభ్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాలు వ్యతిరేకించాయి. దాంతో, ఆ పేరాలో భారత్ పలు మార్పులు చేసింది. ‘‘రెండు రోజుల ఈ సదస్సులో కీలక నేతలు కొన్ని విలువైన సూచనలు చేశారు. మరి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలూ తీసుకొచ్చారు. వీటన్నింటినీ పున:సవిూక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత మాపై ఉన్నాయి. ఈ సదస్సులో చర్చించిన అంశాలపై వర్చువల్‌గా రివ్యూ చేసుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. నవంబర్‌లో ఈ వర్చువల్ భేటీ చేయాలని భారత్ ప్రతిపాదిస్తోంది’’ ఐక్యరాజ్య సమితి గురించి ప్రస్తావించారు. ఐరాస స్థాపించినప్పటికి ఇప్పటికి ప్రపంచం చాలా మారిపోయిందని, ఈ మార్పులకు అనుగుణంగా యూఎన్ లో సంస్కరణలు చేయాల్సిన అవసరముందని సూచించారు. ‘‘ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు ప్రపంచం వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పట్లో కేవలం 51 దేశాలకే సభ్యత్వం ఉండేది. ఇప్పుడా సంఖ్య 200కి చేరుకుంది. కానీ శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్యలో మాత్రం మార్పు రాలేదు. అప్పటికి ఇప్పటికి ప్రపంచం చాలా మారిపోయింది. ఇప్పటికి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాల్సిన అవసరముందని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. జీ20 సదస్సులో కల్చర్ కారిడార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్చరల్ కారిడార్ జీ20 సభ్యులు, ఆహ్వానిత దేశాల భాగస్వామ్య వారసత్వాన్ని సూచిస్తుంది. ఇది జీ20 సభ్యులు, 9 ఆహ్వానిత దేశాల గుర్తింపు చిహ్నాలు.. గుర్తించదగిన సాంస్కృతిక వస్తువులు.. వారసత్వాన్ని కలిగి ఉంటుంది.ఈ కల్చర్ కారిడార్ విభిన్న సాంస్కృతిక వ్యక్తీకరణల అవగాహన.. వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడం, చేరిక, సమానత్వం కోసం.. భాగస్వామ్య గుర్తింపు భావాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన వేదికగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం జీ20 థీమ్ ‘వసుధైవ కుటుంబం’, కల్చర్ వర్కింగ్ గ్రూప్ (అచిఉ) హాల్‌మార్క్ క్యాంపెయిన్ ‘కల్చర్ యూనైట్స్ ఆల్’ ఆధారంగా రూపొందించారు. జీ20 సదస్సు జరిగే భారత మండంపలో దీనిని ఆవిష్కరించి.. రెండు రోజుల పాటు ప్రదర్శించారు. దీనిలో దేశాల వారీగా జీ20 సభ్యులు, 9 ఆహ్వానిత దేశాల సాంస్కృతిక వస్తువులు, వారసత్వ వివరాలను ప్రతినిధులకు తెలిసేలా.. ఏర్పాట్లు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకోకి గ్యావెల్ కు జీ 20 అప్పగించారు. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ. ఇందుకు సంకేతంగా గ్యావెల్ అప్పగించారు. తనకు ఎంతో సన్నిహితుడైన లూయిజ్‌కి గ్యావెల్ అందిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో స్పందించారు. గాంధీజీకి నివాళులర్పించడం ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని వెల్లడిరచారు. అహింసా మార్గంలో దశాబ్దాల పాటు ముందుకు నడిచారని, అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. అంత గొప్ప వ్యక్తికి ఇలా శ్రద్ధాంజలి ఘటించడం చాలా ఉద్వేగంగా అనిపించిందని వెల్లడిరచారు. తన రాజకీయ జీవితంలో మహాత్మా గాంధీజీ స్ఫూర్తి తప్పకుండా ఉంటుందని చెప్పారు.జీ20 2024 అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై బ్రెజిల్ అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశారు. అంచనాలకు అనుగుణంగానే చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తామని వెల్లడిరచారు. జీ20 ని జియో పొలిటికల్ వివాదాలతో విడదీయటం సరికాదని తేల్చి చెప్పారు. కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు. ‘‘బ్రెజిల్‌లో జరగనున్న జీ20 సదస్సులో మేం మూడు అంశాలకు ప్రాధాన్యతనివ్వనున్నాం. ఆకలిపై పోరాటం చేయడం, సుస్థిరాభివృద్ధి సాధించడం, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చేలా ప్రయత్నించడం. వీటిపైనే దృష్టి సారిస్తాం. జీ20ని జియోపొలిటికల్ అంశాలతో విడదీయడం సరికాదు. కేవలం డబ్బుల గురించే కాదు. ప్రజల ఆకలి గురించీ పట్టించుకోవాలి. సుస్థిరాభివృద్ధి ప్రమాదంలో పడుతోంది. ఆదాయంలో అసమానతలు ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి’’