ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలను స్వీకరించిన విషయం విధితమే. ఈ తరుణంలో కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్ ను మహేందర్ రెడ్డి ఆయన స్వగృహంలో కలిశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కష్టానికి ప్రతిఫలంగా మహేందర్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంత్రి మహేందర్ రెడ్డితో ఉన్న తాండూర్ సీనియర్ నాయకుడు కర్ణం పురుషోత్తం రావుకు కేటీఆర్ మీకు మంచి రోజు వస్తాయని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయని కేటీఆర్ అన్నారు.