హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ కొత్త ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ వీ.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… రాహుల్ గాంధీ ఓబీసీలను కించపరుస్తూ మాట్లాడాడని… రాహుల్ ఓబీసీలకు క్షమపణలు చెప్పాలని కొత్త వాదన వినిపిస్తున్నారన్నారు. ఎందుకు క్షమాపణలు చెప్పాలి.. అదానిపై పార్లమెంట్లో ప్రశ్నించినందుకా అని అడిగారు. అదాని విషయం పై ప్రజల దృష్టి మరల్చడానికే ఓబీసీల అంశాన్ని తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. ఏప్రిల్ 1న అన్ని పార్టీలతో సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించపరిచారు అనే విషయంపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏం చేశాయని… ఇప్పుడు తొమ్మిదేళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయంపై చర్చిద్దామని అన్నారు. అదాని గురించి మాట్లాడితే ఓబీసీ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికీ బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయలకు ఓబీసి అంశాన్ని బీజేపీ వాడుకుంటోందని మండిపడ్డారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలతో సహా ఓబీసీ విద్యార్థులు మేధావులను పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాయినడ్ ఎన్నికలకు 30 రోజుల గడువును ఇస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుందని… సీఈసీకి ఉన్న ఆలోచన పార్లమెంట్లో స్పీకర్ లేదని తేలిపోయిందన్నారు. స్పీకర్ బీజేపీ పార్టీకి తొత్తుగా పని చేస్తున్నారని వీ.హనుమంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.