డాడీలో మెగాస్టార్‌ కూతురు ఇప్పుడెలా ఉందో తెలుసా?


మెగాస్టార్‌ చిరంజీవి సిమ్రాన్‌ కాంబినేషన్‌ లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా డాడీ. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్‌ తో తెరకెక్కిన ఈ సినిమాని సురేష్‌ కృష్ణ తెరకెక్కించారు. ఈ మూవీలో చిరంజీవి కూతురుగా డ్యూయల్‌ రోల్‌ లో నటించిన బాలనటిని అందరూ చూసే ఉంటారు. డాడీ సినిమాలో చిన్నా క్యూట్‌ యాక్టింగ్‌ కి అందరూ ఫిదా అయిపోయారు. 2001లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆ చిన్నారి తెలుగులో మళ్ళీ నటించలేదు. హిందీలో ఈ చిన్నారి ఒక సినిమాలో నటించింది. ఈ చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా. ఈ చిననారి ఆ రెండు సినిమాల తరువాత మూవీస్‌ కి గుడ్‌ బై చెప్పేసి చదువుల మీద దృష్టి పెట్టింది. మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్న ఈ చిన్నారి బ్యూటీ హీరోయిన్స్‌ కి ఏ మాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతుంది. అయితే హీరోయిన్‌ గా రాణించాలని ఈ బ్యూటీకి కోరిక లేకపోవడంతో బీలండన్‌ వెళ్లిపోయి అక్కడ డిగ్రీ చేసి తన ఇష్టమైన ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం లండన్‌ లో ఉంటున్న అనుష్క మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్‌ గా రాణిస్తుంది. అయితే సినిమాలు వదిలేసి అక్కడ సెటిల్‌ కావడంతో అనుష్క మల్హోత్రా గురించి ఎవరికి తెలియలేదు. బాలీవుడ్‌ లో ఈ బ్యూటీకి అవకాశాలు వచ్చిన కూడా తిరష్కరించినట్లు తెలుస్తుంది. ఈ జెనరేషన్‌ లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా రాణించిన చాలా మంది హీరోయిన్స్‌ గా తరువాత అడుగుపెట్టి సక్సెస్‌ అయ్యారు. నిత్యా మీనన్‌ కీర్తి సురేష్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌ లాంటి భామలు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా రాణిస్తున్నారు. అలాగే మరికొంత మంది భామలు ఒకటి అర సినిమాలలో కనిపించి మాయమయ్యారు. రీసెంట్‌ గా గంగోత్రి సినిమాలో నటించిన చిన్నారి కూడా మసూద అనే సినిమా ద్వారా హీరోయిన్‌ గా తెరంగేట్రం చేస్తుంది. అయితే చిన్న వయస్సులోనే అభినయంతో అదరగొట్టి ప్రస్తుతం అందంతో మెరిసిపోతున్న అనుష్క మల్హోత్రా మాత్రం హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వకపోవడం విశేషం అని చెప్పాలి. భవిష్యత్తులో అయిన ఈ బ్యూటీ ఆ దిశగా అడుగులు వేసి నటిగా తెరంగేట్రం చేస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *