అతడు ఖలేజా లాంటి సూపర్ హింట్ మూవీస్ తర్వాత హీరో మహేష్బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తి అయింది. త్రివిక్రమ్ శైలి ఫన్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ గత ఏడాది ప్రారంభం అయింది. అయితే తన తల్లి ఇందిరాదేవీ మరణించింది. అయితే నవంబరులో సెకండ్ షెడ్యూల్ తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. దీనితో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పలు మార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రాగా.. చివరకు జనవరిలో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొ దలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా పూజహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలీల కూడా హీరోయిన్ గా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజా విషయం ఏమిటి అంటే… ఈ సినిమాలో మహేశ్ బాబుకు శ్రీలీలకు ఒక ఫోక్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాను ూూవీదీ 28 వర్కింగ్ టైటిల్గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసినా.. షూటింగ్లో ఆలస్యమవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడటం ఖాయమని తెలుస్తోంది. వేసవి తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ‘కాటమరాయుడా’ సాంగ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావా’ అరవింద సమేతలో ‘రెడ్డమ్మ తల్లి’ అల..వైకుంఠపురములో ‘సిత్తరాల సిరపడు’ లాంటి పాటలు జానపదాలను గుర్తు చేసి.. ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సోషల్ మీడియాలోనూ రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఈ పాటతో ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తారో చూడాలి. మహేష్బాబు హీరోగా నటిస్తోన్న 28వ సినిమా ఇది. ఎస్‌ఎస్‌ఎంబీ 28 వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల వైకుంఠపురములో అరవింద సమేత వీర రాఘవ తర్వాత తివిక్రమ్ దర్శకత్వంలో పూజాహెగ్డే నటిస్తోన్న సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29 వ సినిమా చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి… ఈ సినిమాను హలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.