అశ్వారావుపేట: అటవీ పరిశోధన కేంద్రం ఆనవాళ్లు కోల్పోతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి నేడు శిథిలావస్థకు చేరుకుంది. అటవీ మొక్కల పెంపకం, కాలానుగుణంగా వచ్చే మార్పుల పై పరిశోధనలు చేసేందుకు గానూ అశ్వారావుపేట మండలం అచుతాపురం వద్ద అటవీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1980 దశకం నుంచి 20010 వరకు ఉమ్మడి ఏపీతో పాటు జాతీయ స్థాయిలో అటవీ మొక్కలను ఈ పరిశోధన కేంద్రం అందించింది. కానీ నేడు ఆలనాపాలన లేక శిథిలావస్థకు చేరుకుంటోంది. కూలిపోయిన షెడ్లు, పెచ్చులూడతున్న భవనాలు, మెడికల్ ప్లాంట్ బ్లాక్‌లు, చిట్టడవిలా మారిపోయింది. అన్నివైపులా వెళ్లేందుకు నిర్మించిన రోడ్లు కూడా మూసుకునిపోయాయి. ఒక్క రేంజ్ అధికారి తప్ప ఇతర సిబ్బంది ఎవరూ లేరు. ప్రభుత్వం పైసా కూడా మంజూరు చేయకపోవడంతో నానాటికీ శిథిలమ వుతోంది.
నాడు ఎంతో వైభవంనాలుగు దశాబ్దాల క్రితం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్న సమయంలో అచుతాపురం వద్ద అటవీ పరిశోధన కేంద్రం కోసం 110 హెక్టార్లను కేటాయించారు. అప్పటి నుంచి అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, సత్తుపల్లి వంటి ప్రాంతాల్లో అరుదైన ఔషధ మొక్కలను సేకరించి కొత్త రకాల మొక్కల ఉత్పత్తికి పరిశోధనలు ప్రారంభించారు. ఔషధ మొక్కల కోసం వందల రకా ల బ్లాక్‌లను నిర్మించారు. కానీ ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో గొప్ప లక్ష్యంతో నిర్మించిన ఈ కేంద్రం శిథిలావస్థకు చేరుతోంది. ఈ పరిశోధన కేం ద్రంలో బ్లాక్‌ల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులు, చిన్న చిన్న గోడలు తప్ప ఏమీ కనిపించడం లేదు. మొక్కలకు మందులు కలపడానికి నిర్మించిన షెడ్లు, నీళ్లను నింపే తొట్టెలు, పాడైపోయిన బోర్లు, శిథిలమై కూలడానికి సిద్ధంగా ఉన్న కార్యాలయం భవనం.. నాటి ఘన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.రాష్ట్రం మొత్తానికి మొక్కలు అందించగలదురాష్ట్ర ప్రభుత్వం హరితహారం ప్రవేశపెట్టకముందు ప్రతి ఏటా కొన్ని లక్షల అటవీ రకాల మొక్కలను ఇక్కడ పెంచేవారు. సరైన సౌకర్యాలు కల్పించాలే గానీ రాష్ట్రం మొత్తానికి మొక్కలు అందించగల సత్తా ఈ పరిశోధన కేంద్రానికి ఉంది. ఇప్పుడు ప్రతీ పంచాయతీ, మండల కేంద్రాలలో నర్సరీలు ఏర్పాటు చేయడం, ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకోవడంపై దృష్టిపెట్టడంతో ఈ పరిశోధన కేంద్రం ఇప్పుడు కుచించుకొనిపోతోందని స్థానికులు అంటన్నారు. అభివృద్ధిని పక్కన పడేసిన ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం దమ్మపేట మండలం అల్లిపల్లి వద్ద వివిధ రకాల మొక్కల పెంపకానికి అదనంగా 110 హెక్టార్ల భూమిని ఈ కేంద్రానికి కేటాయించింది. సర్కారు నిర్ణయంతో మంచి రోజులు వచ్చాయని అటవీ శాఖ ఉద్యోగులు, స్థానికులు సంబరప డ్డారు. కానీ ఆ ఆనందం ఆవిరవడానికి ఎంతో సేపు పట్టలేదు. భూ కేటాయింపులు చేసిన ప్రభుత్వం తర్వాత ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం.అంతా వృథాఅటవీ పరిశోధనక కేంద్రానికి అచుతాపురం వద్ద ప్రభుత్వం భారీగా కేటాయించిన భూమి ఇప్పుడు వృ?థాగా ఉంది. నిర్మించిన భవనాలు, షెడ్లు, షెడ్‌నెట్లు అన్ని శిథిలమైపోయాయి. వెచ్చించిన రూ.కోట్ల సొమ్ము మట్టిపాలయ్యింది. అతర్జాతీయ, జాతీయ స్థాయిలో వెలుగొందాల్సిన అటవీ పరిశోధనా కేంద్రం నానాటికీ ప్రాభవం కోల్పోతోంది. ఉద్యాన పంటలకు, అడవులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న ప్రభుత్వం ఈ కేంద్రంపై ఎందుకు శీతకన్ను ప్రదర్శిస్తోందో అంతు చిక్కకుండా ఉంది. సారవంతమైన మృత్తికలు, విస్తారమైన నేలలు, సమృద్ధిగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.