ముంబై : ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఏడాది కాలంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లలో మళ్లీ మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనికి కారణం లేకపోలేదు.. కొన్నాళ్లుగా ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.. ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తున్నాయి. దీంతో ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆయిల్ కంపెనీలు భారీ లాభాలు పొందాయి.. నష్టాలు భారీగా తగ్గినట్లు ప్రకటించాయి. దీంతో ఆయిల్ కంపెనీలకు వస్తున్న లాభాలను దృష్టిలో పెట్టుకుని.. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని ఆలోచిస్తున్నాయి.ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 109.66 పైసలుగా ఉంటే.. డీజిల్ లీటర్ రూ. 97. 82 పైసలుగా ఉంది. 2022, మే 22వ తేదీ నుంచి ఈ ధరల్లో మార్పు లేదు. అంతకు ముందు అయితే రోజువారీ మార్పులు జరుగుతూ ఉండేవి.. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా.. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం, తగ్గటం జరిగేది. క్రూడ్ ఆయిల్ ధరలు ఏడాది కాలంలో స్థిరంగా ఉన్నాయి.. అంతర్జాతీయ చమురు ధరలతో సంబంధం లేకుండా.. ఆయిల్ కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచాయి.ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు భారీగా లాభాలు పొంది.. నష్టాలను పూడ్చుకున్నాయి. ఇప్పుడు వస్తున్న లాభాలను.. ధరల తగ్గింపుతో వినియోగదారులకు బదిలీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించటం విశేషం.. ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఏ తేదీ నుంచి అమలు చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గనున్నాయి అనేది రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.