బద్వేలు : ఈనెల 28న భారత పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌముది ముర్ముకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆహ్వానం పంపకపోవడం దురదృష్టకరం, ఆక్షేపనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర విూడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వ చర్య రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం మోడీ నిరంకుషత్వానికి పరాకాష్ట అన్నారు, భారత పార్లమెంటు భవనం దేశ సార్వభౌమత్యానికి ప్రతీక అదేవిధంగా భారత రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరురాలు పార్లమెంట్ అంటే రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ అని భారత రాజ్యాంగం 79 వ అధికరణలో స్పష్టంగా పేర్కొనబడిరది, ఇంటి యజమానిని సంప్రదించకుండా, ఆహ్వానించకుండా, సంబంధం లేకుండా గృహప్రవేశం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మోడీ ప్రభుత్వ వైఖరి, ఒక గిరిజన మహిళను భారత ప్రథమ పౌరురాలిగా, భారత రాష్ట్రపతిగా చేసిన ఘనత బిజెపిది అని గతంలో ప్రధాని మోడీ అన్నారు అటువంటి గిరిజన మహిళను భారత ప్రథమ పౌరురాలు, భారత రాష్ట్రపతి అయిన శ్రీమతి ద్రౌముది ముర్మును ఇలా అవమానపరచడం న్యాయమా? ధర్మమా? సమంజసమా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంపై పునరాలోచించాలని తులసి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్ర పోలీసుల తీరు గర్హనీయం.
అమరావతి రైతులపై ఉక్కు పాదం అవినాష్ రెడ్డి అనుచరులకు దాసోహం అన్నట్లుంది రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరు అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు, అమరావతిలో భూమిని ఇచ్చిన రైతుల, మహిళల శాంతియుత నిరసన కార్యక్రమం పై ఉక్కు పాదం మోపి అరెస్టు చేసి నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు కర్నూలులో అవినాష్ రెడ్డి అనుచరుల నిరసన కార్యక్రమానికి దగ్గరుండి సహకరించడం విడ్డూరం, అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ను మించిపోయింది అని తులసిరెడ్డి ధ్వజమెత్తారు.