
న్యూఢల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢల్లీి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదల చేశారు. ఈసారి ఎమ్మెల్సీ కవితతో పాటు ఢల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై సైతం ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి ఆరోపణలు చేశారు. ఆ ఇంటి ఫర్నిచర్‌కి అయిన ఖర్చులను తానే భరించానన్నారు. అందుకు సంబంధించిన బిల్లులున్నాయని వెల్లడిరచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత షెల్ కంపెనీల అకౌంట్స్ నుంచి మారిషస్ లోని కైలాష్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయ్యిందని తెలిపారు. కోట్ల నగదు బదిలీలు జరిగాయన్నారు.ఇందుకు సంబంధించి కేజ్రీవాల్ ఫేస్ టైం చాట్స్ వివరాలను కూడా త్వరలోనే విడుదల చేస్తానని సుఖేశ్ చంద్రశేఖర్ తెలిపారు. వాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. తనకు అనుకూలమైన జైలు అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశానన్నారు. త్వరలోనే కేజ్రీ వాల్‌కు సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతానని సుఖేశ్ చంద్రశేఖర్ వెల్లడిరచారు.