జగిత్యాల: పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం
2023 పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.సోమవారం జిల్లా సవిూకృత సముదాయాల భవనంలో ని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ` 2023 పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రూ.నెం.117 లో గల జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం, జగిత్యాలలో రూపాయలు150 చెల్లించి పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పూర్ణ చంద్రరావు పాల్గొన్నారు.