విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకుగాను రాష్ట్ర మంత్రి, డీజీపీ,  ఉన్నత పోలీస్ అధికారులు పాల్గొని,   అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని స్థాయిల వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్…

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… 9 ఏళ్లలో వ్యవసాయరంగంపై తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఒక రంగం మీద ఇంత భారీగా ఏ ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. తెలంగాణలో వ్యవసాయానికే తొలిప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి మూలంగా దేశంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. వ్యవసాయ రంగం బలోపేతం మూలంగానే సర్వతోముఖాభివృద్ధి అన్నది కేసీఅర్ ఆలోచనని అన్నారు. వ్యవసాయ రంగం నుండి లభించే విస్తృతమైన ఉపాధి మరే రంగం కూడా ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. ఆ ప్రాధాన్యతను గుర్తించే తెలంగాణ ప్రభుత్వం గత 9 ఏళ్లలో ఉచిత కరంటు, పంటల కొనుగోళ్లు, రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి వంటి రైతు సంక్షేమ పథకాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందిన్నారు. దేశంలో మనకన్నా విస్తీర్ణంలో, జనాభాపరంగా పెద్దవైన రాష్ట్రాలు ఏవీ ఇంత ఖర్చు పెట్టలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ 9 ఏళ్ల కృషికి క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపిస్తున్నాయిని సంతోషం వ్యక్తం చేసారు. పల్లెసీమలు బాగుపడ్డాయి .. ప్రజల చేతికి పని వచ్చింది .. వ్వవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యాయన్నారు. భిన్న వృత్తులు, ఉపాధులు బలపడి సమగ్రమైన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నదిని అన్నారు. అన్నింటికీ వ్యవసాయమే మూలాధారమని, వ్యవసాయం బాగుండాలంటే రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికతో వ్యవహరిస్తున్నామన్నారు. ఈ వానాకాలానికి పత్తి, మిరప, కందులు, వరి మిగిలిన అన్ని రకాలు కలిపి 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనాతో ముందుకు సాగుతున్నామన్నారు. పోటీ ప్రపంచంలో విత్తనాల తయారీలో ప్రైవేటు కంపెనీలదే పైచేయిగా ఉందిని. వాటిని నియంత్రించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నాయని గుర్తుచేశారు. నకిలీ విత్తనాల బెడద సంపూర్ణంగా నివారించబడాలిని ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలిన్నారు. గతంతో పోలిస్తే నకిలీ విత్తనాలు దాదాపు కనుమరుగయ్యాయిని అన్నారు. ఈ విషయంలో టాస్క్ ఫోర్స్, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేయాలిని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నంలో అమాయకులను బలిచేయవద్దన్నారు. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించారు. కర్ణాటక, కర్నూలు, గద్వాల వైపు నుండి, గుంటూరు, ప్రకాశం వైపు నుండి, అసిఫాబాద్, బెల్లంపల్లి వైపు నుండి, గుజరాత్ వైపు నుండి జహీరాబాద్ మీదుగా వచ్చే దారులపై నిఘా ఉంచాలిని ఆదేశించారు. ప్రధానంగా గుజరాత్, ఆంధ్రాల నుండి నకిలీ విత్తనాల బెడద ఉన్నదిని హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా ఈ విషయం రుజువు చేస్తున్నదన్నారు. హెచ్ టీ పత్తి విత్తనాల విషయంలో రైతులను చైతన్యం చేయాలిని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కనిపించే చిన్న, చిన్న లోపాలు, తప్పిదాలపై కఠినంగా వ్యవహరించకుండా ట్రేడర్లు, విత్తన వ్యాపారులకు సమయం ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం ఇవ్వాలిని సూచించారు. దేశంలో అవసరమైన 60 శాతం విత్తనాలను తెలంగాణ అందిస్తున్నదిన్నారు. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలిని కోరారు. వానాకాలం సాగుకు అందుబాటులో విత్తనాలు, విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ , సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ , సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర , డీఐజీ షానవాజ్ ఖాసీం, డీఐజీ ఇంటలిజెన్స్ కార్తికేయ, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంత్ కొడిబ, ఉద్యాన శాఖ డైరెక్టర్ హన్మంతరావు , మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ ఎండీ కేశవులు, అడిషనల్ డీఎ విజయ్ కుమార్, రిజిస్ట్రార్లు సుధీర్ కుమార్ , భగవాన్ తోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఓలు, అన్ని స్థాయిల వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *