లండన్లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మ్యూజియాన్ని లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కే తారక రామారావు సందర్శించారు. బారిష్టర్ చదువు కోసం ఇంగ్లాండు వచ్చిన అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. ఎంతో ఆసక్తితో ఈ మ్యూజియాన్ని తిలకించిన కేటీఆర్ ఆనాడు అంబేద్కర్ నివసించిన గదిని కూడా చూశారు.

హైదరాబాదులో ప్రతిష్టించిన అంబేద్కర్ విగ్రహ నమూనాను మ్యూజియం అధికారులకు కేటీఆర్ బహూకరించారు. ఇండియన్ హై కమిషన్ కు అంబేద్కర్ చిత్రపటాన్ని ఇచ్చారు.

పాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ,ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును అభినందిస్తూ.. ది ఫెడరేషన్ ఆఫ్ అంబేద్క రైట్ ,బుద్ధిష్ట్ ఆర్గనైజేషన్- యూకే అధ్యక్షుడు సంతోష్ దాస్, జాయింట్ సెక్రెటరీ సి గౌతమ్ లు ఓ లేఖను మంత్రి కేటీఆర్ కు అందించారు.

“అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి, జాతి నిర్మాణానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని కొనసాగిస్తూ తెలంగాణలో మీరు చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలకు అభినందనలు. హుస్సేన్ సాగర్‌ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయడం తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి గర్వకారణం.తెలంగాణ కొత్త సచివాలయ సముదాయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడం ఆయన పట్ల మీకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది.” అని ఆ లేఖలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ని ప్రశంసించారు.

బాబా సాహెబ్ యొక్క సహకారాన్ని హైలైట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అసాధారణ ప్రయత్నాలకు FABO UK కూడా మంత్రి కేటీఆర్‌ను సత్కరించింది. FABO UK ప్రెసిడెంట్ సంతోష్ దాస్ ఆమె విలియం గౌల్డ్ మరియు క్రిస్టోఫ్ జాఫ్రెలాట్‌లతో కలిసి రచించిన “అంబేద్కర్ ఇన్ లండన్” పుస్తకం యొక్క సంతకం కాపీని మంత్రి కేటీఆర్‌కు అందించారు.

ప్రజాస్వామ్య ,సంక్షేమ భారత నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని ఈ తరానికి తెలియజేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ది ఫెడరేషన్ ఆఫ్ అంబేద్క రైట్ ,బుద్ధిష్ట్ ఆర్గనైజేషన్- యూకే మంత్రి కేటీఆర్ ను సత్కరించింది ఈ సందర్భంగా అంబేద్కర్ ఇన్ లండన్ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కు అందించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *