న్యూ ఢల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో 50 నియోజక వర్గాల విూదగా వెళ్లిందని.. ఆ 50 స్థానాల్లో బీజేపీ కేవలం 4సీట్లు మాత్రమే గెల్చిందని ఏఐసీసీ సెక్రెటరీ వంశీ చందర్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర ప్రభావం చాలా ఉందన్నారు. డిసెంబర్‌లో జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్‌లో, రాజస్థాన్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. వచ్చే 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. రేపు సీఎల్పీ సమావేశం జరగనుందని.. మెజారిటీ ఎమ్మెల్యేల అభ్యర్థుల నిర్ణయం మేరకు సీఎంని ఎన్నుకుంటారని వంశీచందర్ రెడ్డి పేర్కొన్నారు