కర్ణాటక ప్రజలకు అభినందనలు ధన్యవాదాలు తెలిపిన రాహుల్ గాంధీ. ఇక కర్ణాటకలో ద్వేషపూరిత బజార్ బందైందని, ప్రేమ సామరస్యం దుకాణాలు తెరుచుకున్నాయంటూ బీజేపీ చురకలంటించారు. తాము ఎన్నికల ప్రచారంలో చేసిన ఐదు వాగ్దానాలను మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే అమలు చేస్తామన్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చిరస్మరణీయ విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మరీ కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ మెజార్టీ సీట్లు కట్టబెటుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల బట్టి చూస్తే ఆ పార్టీ అభ్యర్థులు 136కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.