దీనిపై సిఎం చర్చలకు ఆహ్వానించాలి :బిసి సంఘాలు హైదరాబాద్ మే 12 గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సమ్మె విరమించుకోకపోతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ బెదిరించడం ప్రజాస్వామ్య చర్య నిరంకుశ చర్య అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్న 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం బెదిరించడం మానుకొని చర్చలకు ఆవ్హ్హణించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేసారు.నేడు జాతీయ బిసి సంక్షేమ సంఘం దాని 15 అనుబంద సంఘాలు సమ్మె చేస్తున్న 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మద్దతుగా సమావేశమై ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కు విజ్ఞప్తి చేశాయి.సమ్మె చేయడం ,సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంఘం లోని 19 వ ఆర్టికల్ ప్రజలకిచ్చిన ప్రాథమిక హక్కు.దీనిని ఏ ప్రభుత్వ
ఏకోర్ట్ ?ఏ సంస్థ ?సవాలు చేయడానికి వేలు లేదు.మనదేశం ఒరజాస్వామ్య దేశం,ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యమాల ద్వారనేప్రజలు తమ డిమాండ్లు ప్రభుత్వ దృస్టికి గత 75 సంవస్సరాల స్వాతంత్ర భారత దేశం లో జరుగుతుంది.ఇది కొత్త కాదు.ఇది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కూడా కాదు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాల ద్వారా తెలంగాణ తెచ్చారు. ఉద్యమాల ద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఉద్యమాలను అణిచివేయడం న్యాయం మా? అని ప్రశ్నించారు. ఈ నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రతి ఒక్కరి కి సమ్మె చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. పైగా జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మె న్యాయమైనది. వీరిని ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు మూడు సంవత్సరాలలో రెగ్యులరైజ్ చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు కానీ తర్వాత ఉ.ూ26 ద్వారా మరో సంవత్సరం పొడిగించడం జరిగింది. కానీ జీవో 26 ప్రకారం నాలుగు సంవత్సరాల గడిచిన కూడా రెగ్యులర్ చేయకపోవడంతో అనివార్య పరిస్థితులలో సమ్మెకు వెళ్లడం జరిగింది.గత 14 రోజులుగా సమ్మె చేయడం వలన గ్రావిూణ పాలన స్తంబించి పోయింది.విద్యార్థులకు కుల,ఆదాయ తదితర సర్టిఫికట్లు ఇచ్చేవారు లేరు.ఇటీవల ఇంటర్,ఎస్‌ఎస్‌సి ఫలితాలు వచ్చాయి. అన్నీ పోటీ పరీక్షలకు నోటిఫికెన్స్ వస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని చర్చలకు పిలిచి సమ్మె విరమింపజేయాలని కోరారు. వీరిని న్యాయమైన డిమాండ్లకు ప్రజా సంఘాలు, బీసీ/ఎస్సీ/ఎస్టీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు శాసనసభ్యులు పూర్తి మద్దతు ప్రకటించారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం తగురీతిలో స్పందించకపోవడం న్యాయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమాల ద్వారానే గొప్ప జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందడం జరిగింది. ఉద్యమాలు చేసి తెలంగాణను తెచ్చారు, ఉద్యమాలను గౌరవించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతిష్టకు పోకుండా తమ బిడ్డ లాంటి చిరు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. .మూడేళ్లకు రెగ్యులర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మూడేళ్ల తర్వాత రెగ్యులర్ చేయకుండా ఉ.ూ 26 ను తీసుకొచ్చి ఇంకో ఏడాది ప్రొఫెషన్ పీరియడ్ ను పెంచుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అయినా కూడా మేము పెంచిన మరియొక సంవత్సరంతో పాటు మొత్తం నాలుగేళ్లు ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయడం జరిగింది.రెగ్యులర్ చేయాలంటూ రెండేళ్లు అధికారులు చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోలేదు. 11 ఏప్రిల్ 2023 తో నాలుగేళ్ల సర్వీస్ ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం వైపు నుండి రెగ్యులర్ చేస్తున్నాం అని ఎటువంటి ప్రకటన రాకపోవడం వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురై తీవ్రమైన అభద్రతా భావంతో తేదీ: 13 ఏప్రిల్ 2023న ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించి, తేదీ: 28 ఏప్రిల్, 2023 నుండి నివధిక సమ్మెను చేపట్టడం జరిగింది. మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ నిబంధనతో 15వేల జీతంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకొని, మూడేళ్ల తర్వాత గ్రేడ్
4 ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లోనే పేర్కొన్నది.చాలా మందికి ఇతర ఉధ్యోగాలు ముఖ్యంగా కానిస్టేబుల్, కోర్టు, సింగరేణి లాంటి ఉద్యోగాలు వచ్చిన అన్నిటిని వదులుకుని బంగారు తెలంగాణ పునర్నిర్మాణం లో భాగస్వామ్యం అవుతామని ఆశ తో మూడేళ్లకు రెగ్యులర్ అవుతాం అని నమ్మకంతో ఎంతో మంది యువతీ యువకులు నెగెటివ్ మార్కింగ్ విధానం లో పరీక్షలు రాసి రాజ్యాంగ బద్దంగా ఈ ఉద్యోగం లో చేరిన్నారు. మూడేళ్ళ పాటు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఒత్తిడుల ఎదుర్కుంటూ సుమారు 50 రకాల విధులను నిర్వర్తిస్తూ ఎన్నో జాతీయ అవార్డులు తీసుకు రావడం ఒక్క 2023 లోనే దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కానీ 13 జాతీయ అవార్డులు తీసుకు రావడం జరిగింది రాత్రింబవళ్ళు పని చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈ విజయం సాధించారు పల్లె ప్రగతి పనులను విజయవంతంగా నిర్వర్తించి గ్రామాల్లో ఎన్నో ఆస్తులను సృష్టించి ప్రజలందరి మన్ననలు పొందడం జరిగింది.ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది విది నిర్వహణ లో ప్రమాదలకు గురై సుమారు 56 మంది మరణిస్తే ఆ కుటుంబాలకు ఉద్యోగ భద్రత ఆర్థిక భద్రత లేకుండా పోయింది.