హైదరాబాద్ : ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. కానీ సోమేశ్ కుమార్ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా పనిచేయడంపై ఆసక్తి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. భూ భకాసురులు పేదల భూములు ఆక్రమించుకునేందుకు సోమేశ్ సహాయ పడ్డారని చెప్పారు. ధరణితో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ధరణి పేరు చెప్పి కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను లాక్కున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పేదల భూములు లాక్కుని రియలెస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారని ఆరోపణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లో సూత్రదారి సోమేశ్ కుమార్‌ను మళ్ళీ సలహాదారుగా నియమించుకున్నారని అన్నారు. ఓఆర్‌ఆర్ లీజు వెనక సోమేశ్ కుమార్, అరవింద్ ఉన్నారని ఆరోపించారు.30 సంవత్సరాలు లీజ్ కు ఇచ్చే ఐడీయా ఏందని, ఐఏఎస్‌లు అభివృద్ధికి దోహాదపడాలి కానీ, ఇలా అమ్మకానికి కాదన్నారు. వచ్చే 30 సంవత్సరాల ఆదాయం ఇప్పుడు తీసుకుంటే.. వచ్చే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. ఇంత మంది సలహాదారులు ఎందుకు..? అని ప్రశ్నించారు. రిటైర్ అధికారుల తో ప్రభుత్వంను నడుపాలనుకుంటుంన్నారా? అని ప్రశ్నించారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్ శాఖకు రిటైర్ అయిన వ్యక్తిని ఈన్సీగా ఎలా కొనసాగిస్తారు? అని భట్టి ప్రశ్నించారు. సోమేశ్‌కుమార్‌ను సలహాదారుగా నియమించడం అంటే.. మళ్ళీ దోపిడీ ప్రారంబించినట్లేనని విమర్శించారు. వెంటనే సోమేశ్ కుమార్ సలహాదారు పదవిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమేశ్‌కుమార్‌పై ఎంక్వరీ వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ గుంజుకున్న భూములు అన్ని తిరిగి ఇచ్చేస్తామన్నారు. సోమేశ్ కనుసన్నల్లోనే హైదరాబాద్ చుట్టూ లక్షల కోట్ల భూములు చేతులు మారాయాని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం లోనే 5లక్షల కోట్ల విలువైన భూమిని ఇంధిరమ్మ పేదలకు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ సంక్షేమంలో కోత పెట్టడం తప్ప బీఆర్‌ఎస్ చేసింది ఏంటి? అని ప్రశ్నించారు.