పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి తనను గెలిపిస్తే గెలిచిన వారం రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్నాలుగేండ్లు గడిరచిన ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు పసుపుబోర్డు తీసుకురాకపోవడంతో ఆయన ఎన్నికల్లో వ్రాసిచ్చిన బాండ్ పేపర్ ను ప్లెక్సీ విూద రూపొందించి పిండ ప్రధానం చేస్తూ గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంగళవారం మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల గ్రామంలో గత పార్లమెంట్ ఎలక్షన్స్ సమయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తనను గెలిపిస్తే గెలిచిన వారం రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి పురోగతి, పసుపు బోర్డు తీసుకోరాలేదని గ్రామస్తులు ,నాయకులు కలిసి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ వ్రాసిఇచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రధానం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఆరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే నిరసన తెలిపారు.ఈ మేరకు గ్రామస్తులు మాట్లాడుతూ పసుపు బోర్డు వస్తే నియోజకవర్గం లోని రైతులకు మేలు జరుగుతుందని, అలాగే పసుపు బోర్డుకు మద్దతు ధర కల్పించడంలో ఎంపీ అరవింద్ పూర్తిగా విఫలమయ్యాడని ఆన్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వివిధ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.