కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం దగ్గర జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శులు చేస్తున్న శాంతియుత నిరవదిక సమ్మె కు మద్దతు తెలిపిన ఈటల రాజేందర్. జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శులు చేస్తున్న ధర్నాలో ఈటల రాజేందర్ కూర్చొని మరి వారికీ తానునన్నంటూ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసారు. ఈటల రాజేందర్తోపాటుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు సైతం ధర్నాలో పాల్గొన్నారు.