English News Headline
CM Revanth Reddy Lays Foundation Stone for ₹38 Crore Sant Sevalal Maharaj Temple in Nagarkurnool

Full Telugu News Article
నాగర్కర్నూల్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగులో రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం, విగ్రహ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు, బంజారాల సంక్షేమం, విద్య, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మద్దిమడుగు చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
రూ.71 కోట్లతో మూడు అభివృద్ధి పనులు
మద్దిమడుగు ప్రాంతంలో మొత్తం రూ.71 కోట్లతో చేపట్టనున్న మూడు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
వీటిలో రూ.38 కోట్లతో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం, విగ్రహ నిర్మాణం, రూ.15 కోట్లతో హరిత హోటల్ భవనం, రూ.18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు ఉన్నాయి.
సంత్ సేవాలాల్ ఆలయాన్ని 16 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, మరో నాలుగు ఎకరాలు సేకరించి అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు.
గిరిజనులకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత
రాష్ట్రంలో బంజారాలు, ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాల్లో గిరిజన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీలకు సుమారు 45 శాతం కేటాయించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 3.48 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, లంబాడ, ఆదివాసీ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శాలు గుర్తుచేసిన సీఎం
సంత్ సేవాలాల్ మహారాజ్ లంబాడీ సమాజానికి గొప్ప ఆదర్శమూర్తి అని ముఖ్యమంత్రి అన్నారు. శాంతియుత జీవనం, హింసకు దూరంగా ఉండటం, పేదలకు సేవ చేయడం, సమాజానికి ఆదర్శంగా నిలవడం వంటి విలువలను ఆయన బోధించారని గుర్తుచేశారు.
లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఉద్దేశంతో 1976లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా ఆ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో అవకాశాలు లభించాయని తెలిపారు.
అచ్చంపేట ప్రాంత అభివృద్ధికి హామీ
తనకు నల్లమల ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొండారెడ్డిపల్లికి చెందిన తనకు అచ్చంపేట ప్రాంత ప్రజల కష్టపడే తత్వం, పోరాట స్ఫూర్తి ఎంతో నేర్పిందని అన్నారు.
అచ్చంపేటలో బ్రిడ్జి, లిఫ్ట్ పనులతో పాటు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి నీరు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర సిలారపు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Full English News Article
Telangana Chief Minister A. Revanth Reddy has laid the foundation stone for the construction of Sant Sevalal Maharaj Temple and its statue at Maddimadugu village in Padara mandal of Nagarkurnool district.
The project, estimated to cost ₹38 crore, is part of the government’s efforts to promote tribal welfare and development in the region. Addressing a public gathering, the Chief Minister said his government was committed to improving the living conditions of Lambadi and Adivasi communities.
Before attending the programme, Revanth Reddy visited Sri Pabbati Anjaneya Swamy Temple at Maddimadugu and performed special prayers.
Three Development Projects Worth ₹71 Crore
The Chief Minister laid foundation stones for three development projects with a combined estimated cost of ₹71 crore.
These include the Sant Sevalal Maharaj Temple and statue project worth ₹38 crore, a Haritha Hotel building costing ₹15 crore and development works at Sri Pabbati Anjaneya Swamy Temple estimated at ₹18 crore.
He said the Sant Sevalal Maharaj Temple would initially be developed across 16 acres, with plans to acquire an additional four acres to create a major temple complex.
Tribal Communities to Receive Welfare Benefits
Revanth Reddy said the government was giving priority to the development of Banjara and Adivasi communities through various welfare programmes.
He stated that Scheduled Castes and Scheduled Tribes accounted for approximately 45 per cent of the eight lakh Indiramma houses sanctioned by the government.
The Chief Minister also highlighted the distribution of fine rice to 3.48 crore poor people across Telangana, saying Lambadi and Adivasi communities were among the major beneficiaries.
He referred to free bus travel for women and free electricity up to 200 units as initiatives benefiting tribal households.
CM Highlights Sant Sevalal Maharaj’s Teachings
The Chief Minister described Sant Sevalal Maharaj as an inspirational figure for the Lambadi community.
He recalled the teachings of peaceful living, staying away from violence and serving the poor.
Revanth Reddy also referred to the inclusion of Lambadas in the Scheduled Tribes list in 1976 during Indira Gandhi’s tenure as Prime Minister, stating that reservation benefits had helped members of the community access opportunities in education, employment and public life.
Development Assurances for Achampet
Recalling his association with the Nallamala region, the Chief Minister said he took pride in his connection with the people of Achampet and surrounding areas.
He assured that pending development works, including bridge and lift-related projects in Achampet, would be completed.
He also promised that the government would take responsibility for providing water to the region from the Dindi project.
Ministers Damodara Cilarapu, Jupally Krishna Rao, Vakiti Srihari and Adluri Lakshman Kumar, along with public representatives and officials from the erstwhile Mahabubnagar district, attended the programme.