English News Headline
Indiramma Family Life Insurance Scheme: Ward 20 Councilor Urges Eligible Residents to Enroll

పూర్తి తెలుగు వార్తా కథనం
అలియాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అన్ని వార్డులకు చెందిన అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని 20వ వార్డు కౌన్సిలర్ కోడూరి మౌనిక దినేష్ కోరారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో పరిధి 20వ వార్డులో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు బీమా నమోదు ప్రక్రియ నిర్వహణను పర్యవేక్షించారు. అలియాబాద్ మున్సిపాలిటీలోని అర్హులైన ప్రతి ఒక్కరూ బీమా నమోదు చేసుకుని కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకంలో భాగస్వాములు కావాలని కౌన్సిలర్ కోడూరి మౌనిక దినేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అర్హులైన లబ్ధిదారులు కేవలం మూడు నిమిషాల్లోనే బీమా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. నమోదు ప్రక్రియ సులభంగా ఉండటంతో లబ్ధిదారులు ఆసక్తి చూపినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
English News Article
Aliaabad: Koduri Mounika Dinesh, Councillor of Ward No. 20 in Aliaabad Municipality, has appealed to all eligible residents across the municipality to make use of the Telangana Government’s Indiramma Family Life Insurance Scheme.
As part of the initiative, an awareness programme was conducted in Ward No. 20 of Aliaabad Municipality in Medchal–Malkajgiri district. The councillor supervised the insurance enrolment process for eligible beneficiaries and encouraged residents to register under the scheme.
She urged every eligible person in the municipality to complete the enrolment process and become part of the government initiative, which aims to provide financial security to families.
During the programme, several eligible beneficiaries successfully completed their insurance registration in just three minutes. Programme organisers said the simple registration process had encouraged more residents to show interest in enrolling under the scheme.