English News Headline
Hyderabad: Technician Dies, Another Injured in Lift Accident at Nanakramguda SAS Building

Full Telugu News Article
హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఘోర లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఏఎస్ భవనంలో లిఫ్ట్ మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కదలడంతో ఇద్దరు సిబ్బంది ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో టెక్నీషియన్ రంగొల్ల మనోహర్ ప్రాణాలు కోల్పోగా, మరో ఉద్యోగి అల్లూరి వాసు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. టీకేఈ ఎలివేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న రంగొల్ల మనోహర్, అల్లూరి వాసు నానక్రామ్గూడలోని ఎస్ఏఎస్ భవనం రెండో అంతస్తులో లిఫ్ట్ నిర్వహణ పనులు చేపట్టారు. ఈ సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా పైకి కదలడంతో ఇద్దరూ మధ్యలో చిక్కుకుపోయారు.
ఈ ప్రమాదంలో మనోహర్ శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది అతడిని గచ్చిబౌలిలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మనోహర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదే ఘటనలో అల్లూరి వాసుకు తల, కుడిచేతిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై మృతుడి బంధువు రంగొల్ల వెంకటేశ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లిఫ్ట్ మరమ్మతు పనులు నిర్వహించే సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంబంధిత కంపెనీ యాజమాన్యం, పర్యవేక్షకుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Full English News Article
Hyderabad: Technician Dies in Lift Accident at Nanakramguda, Another Worker Seriously Injured
A tragic lift accident at the SAS building in Nanakramguda, Hyderabad, claimed the life of a technician and left another employee seriously injured while they were carrying out lift maintenance work.
According to the details provided, Rangolla Manohar and Alluri Vasu, employees of TKE Elevation India Private Limited, were performing lift repair work on the second floor of the SAS building when the lift suddenly moved upwards, trapping both workers.
Manohar sustained critical injuries in the incident. Colleagues immediately shifted him to Himagiri Hospital in Gachibowli. However, doctors declared him dead on arrival.
Another employee, Alluri Vasu, suffered serious injuries to his head and right hand. He is currently undergoing treatment at a hospital.
Complaint Filed with Raidurgam Police
Rangolla Venkatesh, a relative of the deceased, lodged a complaint with Raidurgam Police, alleging that adequate safety precautions were not followed during the lift maintenance work.
Based on the complaint, police registered a case and initiated an investigation.
Investigators are examining whether negligence on the part of the company management or supervisors contributed to the accident. The exact cause of the incident is yet to be established.