చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు.. నివాసానికి వెళ్లి పరామర్శ

English News Headline

CM Revanth Reddy Visits Chukka Ramaiah on 101st Birthday, Hails His Contribution to Telangana and Education

Full Telugu News Article

ప్రముఖ విద్యావేత్త, లెక్కల మాస్టారుగా పేరొందిన చుక్కా రామయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 101వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చుక్కా రామయ్య జన్మదినం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ చుక్కా రామయ్య క్రియాశీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఐఐటీ అనే పదాన్ని సామాన్య ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్తగా ఆయన సేవలను కొనియాడారు. విద్యారంగంలోనే కాకుండా శాసనమండలి సభ్యుడిగా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి తనదైన ముద్ర వేశారని అన్నారు.

చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేసిన విషయాన్ని తాను గర్వంగా భావిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. శాసనమండలిలో సామాజిక, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వాటి పరిష్కారానికి విలువైన సూచనలు చేసేవారని గుర్తుచేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాల లేకపోయిన విషయాన్ని చుక్కా రామయ్య శాసనమండలిలో ప్రస్తావించే వరకు ఆ సమస్యపై సరైన దృష్టి పడలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన ప్రస్తావన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు.

కాలానికి, రాజకీయాలకు అతీతమైన వ్యక్తిత్వం చుక్కా రామయ్యదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఆయన ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ప్రముఖుల శుభాకాంక్షలు

ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తదితరులు పాల్గొని చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Full English News Article

Telangana Chief Minister A. Revanth Reddy visited the residence of renowned educationist and mathematics teacher Chukka Ramaiah to convey birthday wishes on his 101st birthday.

Describing the occasion as a significant day for the people of Telangana and the state’s education system, the Chief Minister praised Ramaiah’s remarkable contributions to education and society.

Revanth Reddy recalled Ramaiah’s active participation in both the Indian freedom movement and the Telangana movement. He described him as an eminent educationist who popularised the concept of IIT among students and the general public.

The Chief Minister also highlighted Ramaiah’s contribution as a member of the Legislative Council, where he consistently raised regional, social and public issues and suggested solutions to the government.

Recalling his association with Chukka Ramaiah and Professor Nageshwar, Revanth Reddy said he considered it a matter of pride and privilege to have worked alongside such distinguished personalities.

He particularly recalled Ramaiah raising the absence of a degree college in the erstwhile Ranga Reddy district in the Legislative Council, following which the government took a decision on the issue.

Describing Ramaiah as a personality beyond the limitations of time and politics, the Chief Minister wished him good health and a long life. He added that the government continued to move forward by taking inspiration from Ramaiah’s thoughts, suggestions and advice.

Prominent Personalities Extend Birthday Wishes

MP Anil Kumar Yadav, MLC Professor Kodandaram, MLA Koonamneni Sambasiva Rao, Justice Sudarshan Reddy, Professor Haragopal and senior journalist Ramachandra Murthy were among those who joined the Chief Minister in extending birthday greetings to Chukka Ramaiah.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *