English News Headline
Revanth Reddy Seeks GDP-Based Delimitation, Warns Against Reduced Representation for Southern States

Full Telugu News Article
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటు రాష్ట్రాల ఆర్థిక ప్రగతిని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కేవలం జనాభా ఆధారంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా, రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండింటినీ పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో ఏబీపీ నెట్వర్క్ నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’ మీడియా కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడారు. జనాభా ఆధారంగా మాత్రమే సీట్ల పెంపు జరిగితే ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభివృద్ధి నమూనాపై ప్రస్తావన
దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ గతంలో అనుసరించిన విధానాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పేదల అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వసించారని గుర్తుచేశారు. నెహ్రూ హయాంలో విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత లభించిందని, అనేక విద్యాసంస్థలు, నీటిపారుదల ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని వివరించారు.
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలను కొనసాగించిన తీరును ప్రస్తావించారు. పేదల సంక్షేమం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ అభివృద్ధి నమూనా అని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047తో అభివృద్ధి లక్ష్యం
తెలంగాణను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమన్నారు.
గత మూడేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో 65 శాతం అమలు చేశామని, మిగిలిన కార్యక్రమాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హాజరుకావాలని ఆహ్వానించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటైన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పలు సంస్కరణలు చేపట్టినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని వివరించారు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కళాశాలలు దూరంగా ఉండటంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్న సమస్యను పరిష్కరించేందుకు ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్య పరిధిలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి ప్రాధాన్యత
విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పాత తరహా కోర్సులకు బదులుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయని వెల్లడించారు.
క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా రంగంలో గుర్తింపు పొందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సుమారు 8 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చామని, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మెస్సీ తన అభిమాన క్రీడాకారుడని, గతంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డియాగో మారడోనా కూడా తన అభిమాన ఆటగాడని ముఖ్యమంత్రి వెల్లడించారు.
Full English News Article
Revanth Reddy Calls for GDP-Based Delimitation, Raises Concerns Over Southern States’ Representation
Telangana Chief Minister A. Revanth Reddy has called for a balanced approach to the delimitation of Lok Sabha constituencies, arguing that population should not be the sole criterion for increasing parliamentary seats. He said the economic performance of states, particularly their Gross Domestic Product (GDP), should also be considered.
Speaking at the ABP Network’s ‘The Southern Rising Summit 2026’ media conclave in Hyderabad, the Chief Minister expressed concern that a proposed 50 per cent increase in parliamentary seats based solely on population could reduce the relative representation of southern states.
He warned that such a move could create a situation in which northern states would have a disproportionately greater influence in government formation at the Centre.
He suggested that both population and the economic contribution of individual states should be taken into account during the delimitation exercise.
Congress’ Development Model
Revanth Reddy also spoke about India’s development journey and the policies pursued by previous Congress governments.
He recalled Mahatma Gandhi’s and Jawaharlal Nehru’s emphasis on improving the living conditions of poor people. He highlighted Nehru’s focus on education and irrigation, including the establishment of educational institutions and irrigation projects.
The Chief Minister also referred to the economic reforms initiated during former Prime Minister P.V. Narasimha Rao’s tenure and continued under former Prime Minister Manmohan Singh.
He said the Congress development model focused on poverty alleviation and providing equal opportunities to all sections of society.
Telangana Rising 2047 Vision
The Chief Minister said the Telangana Rising 2047 vision had been formulated to position the state as a leading contributor to India’s economic growth.
He highlighted projects such as Bharat Future City and AI City as important initiatives aimed at establishing Telangana as a globally recognised investment and technology destination.
He claimed that 65 per cent of the programmes undertaken by his government over the past three years had been implemented and that the remaining initiatives would be completed over the next two years.
He also invited international investors and industrialists to explore investment opportunities in Telangana.
The Chief Minister extended an invitation to global investors for the Invest Telangana Global Summit scheduled for December 7, 8 and 9.
Education Reforms and Student Welfare
Revanth Reddy said the government was undertaking several reforms to improve the quality of education in government schools and bring them on par with private educational institutions.
He said around 27 lakh students in the state were being provided breakfast and midday meals at their schools.
According to the Chief Minister, these initiatives had contributed to improved student attendance.
He also highlighted plans to bring intermediate education under the School Education Department to address difficulties faced by students who have to travel long distances to attend intermediate colleges after completing Class 10.
Focus on Skills Development and Employment
The Chief Minister said his government was prioritising skill development and employment alongside formal education.
He referred to the establishment of Young India Skills University, with Anand Mahindra as its chairman, and the transformation of Industrial Training Institutes (ITIs) into Advanced Technology Centres.
He also said the government was working to bring international-standard education to Telangana and referred to plans for universities such as Oxford and Harvard to establish campuses in the state.
Telangana’s Sports Ambitions
Revanth Reddy said the government was taking initiatives to strengthen sports infrastructure and enhance Telangana’s international sporting profile.
He referred to the Khelo India Youth Games, in which around 8,000 athletes were participating.
The Chief Minister also spoke about bringing football legend Lionel Messi to Telangana and efforts to invite Portuguese football star Cristiano Ronaldo to the state.
He said Messi was among his favourite footballers and recalled that Argentine legend Diego Maradona had also been one of his favourite players.