కోస్గి సైన్స్ మ్యూజియం ప్రారంభించిన సీఎం.. విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించిన రేవంత్

English News Headline

CM Revanth Reddy Inaugurates Sir C.V. Raman Science Museum in Kosgi, Watches Students’ Experiments

Full Telugu News Article

వికారాబాద్: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడంతో పాటు ప్రయోగాత్మక విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

మూడు రోజుల కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు నూతన భవనాలను ప్రారంభించారు.

కోస్గిలోని సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

అనంతరం మ్యూజియంలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన వివిధ పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించారు. ఆయా పరికరాల పనితీరును విద్యార్థులు ప్రయోగాల ద్వారా వివరించగా ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు.

శాస్త్రీయ అంశాలను పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రయోగాల ద్వారా నేర్చుకునేందుకు ఈ మ్యూజియం ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Full English News Article

Chief Minister A. Revanth Reddy inaugurated the newly constructed Sir C.V. Raman Science Museum at Kosgi mandal headquarters in Kodangal constituency, aiming to encourage scientific learning and practical education among students.

As part of his three-day visit to the Kodangal constituency, the Chief Minister participated in several programmes on the second day. He also laid foundation stones for various development works and inaugurated newly constructed buildings.

After inaugurating the science museum, Revanth Reddy paid floral tributes to the statue of renowned physicist Sir C.V. Raman.

He subsequently inspected the exhibition featuring various physics-related instruments and scientific models. Students demonstrated how the equipment worked through practical experiments, which the Chief Minister watched with keen interest.

Revanth Reddy observed that the museum would help students understand scientific concepts through practical experiments rather than limiting their learning to textbooks.

Minister Jupally Krishna Rao, public representatives, the District Collector and officials from various departments attended the programme.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *