మేడ్చల్ నియోజకవర్గం పరిదిలోని కీసర, మూడుచింతలపల్లి మండలాల్లో కొనుగులు కేంద్రాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సద అండగా ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (pacs) కీసర ఆధ్వర్యంలో 1.5 కోట్లతో నిర్మాణం చేపట్టిన గీడ్డంగి (గోదాం) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు బందు జిల్లా అధ్యక్షులు నంద రెడ్డి, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏ ఏం సి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.