English News Headline
Telangana CM Revanth Reddy Directs Officials to Expedite Maharashtra Talks on Tummidihatti Barrage

Full Telugu News Article
మహారాష్ట్రతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన చర్చలను నిరంతరం కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల వివరాలు, పరిహారం చెల్లింపు అంశాలపై పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మహారాష్ట్రతో ఇటీవల జరిగిన చర్చలు, ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇతర సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించారు. గతంలో కుదిరిన ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్లో జమ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ముంపు భూములకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సర్వేకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం లేదని వెల్లడించారు. మహారాష్ట్ర అధికారులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Full English News Article
Telangana Chief Minister A. Revanth Reddy has directed irrigation department officials to maintain continuous consultations with Maharashtra over the proposed Tummidihatti Barrage. He asked officials to prepare comprehensive details about the land likely to be submerged in Maharashtra and the proposed compensation arrangements.
The Chief Minister reviewed the Tummidihatti Barrage issue with senior officials at his Jubilee Hills residence, along with Irrigation Minister N. Uttam Kumar Reddy.
During the meeting, officials discussed recent consultations with Maharashtra and matters relating to the project. Revanth Reddy instructed the irrigation department to submit documents concerning agreements already reached and other relevant issues to the Maharashtra government.
The Chief Minister stated that Telangana was prepared to pay appropriate compensation for land that could be submerged in Maharashtra. He also said the state was willing to deposit the required funds in a joint account for this purpose.
He further clarified that Telangana had no objection to Maharashtra conducting a survey of the land likely to be affected by submergence.
The Chief Minister directed officials to provide Maharashtra authorities with the required information regularly to facilitate further discussions.
Irrigation Adviser Adityanath Das and other senior officials attended the review meeting.