కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నారు అందుకు తాజా సంఘటనలు చెప్పకనే చెపుతున్నాయి. తాజాగా బెంగళూరు, మైసూరులో ఏకకాలంలో బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వీరు ఆర్థిక సాయం చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.15 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు.