కెసిఆర్ అన్నదాతలకు ఉండగా ఉంటూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తులు తీసుకుంటోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసానిచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామన్నారు. ఎకరాకు 10వేల సహాయంతో రైతులకు అండగా నిలుస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతుందిని ఆరోపించారు. రైతుల ధాన్యాన్ని తీసుకోవడంలో ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వెకిలి చేష్టలు చేస్తుందన్నారు. నష్టపోయిన పంటలకు కేసీఆర్ ఎకరానికి 10వేల ఇచ్చినట్లు కేంద్రం కూడా 10వేలు ప్రకటించాలిని మంత్రి డిమాండ్ చేసారు. అప్పుడే బిజెపి నాయకులు రైతుల పొలాల్లో అడుగు పెట్టాలిన్నారు.